కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Published : 09 Nov 2022 00:04 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.





నేనెవర్ని?

1. నేను నాలుగు అక్షరాల పదాన్ని. ‘కత్తి’లో ఉంటాను కానీ ‘సుత్తి’లో లేను. ‘లవం’లో ఉంటాను కానీ ‘ద్రవం’లో లేను. ‘బంతి’లో ఉంటాను కానీ ‘చామంతి’లో లేను. ‘దమ్ము’లో ఉంటాను కానీ ‘కొమ్ము’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?

2. రెండు అక్షరాల పదాన్ని నేను. ‘దానం’లో ఉన్నాను కానీ ‘వనం’లో లేను. ‘సిరి’లో ఉన్నాను కానీ ‘సిరా’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?


వాక్యాల్లో జీవుల పేర్లు

ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి. వాటిలో జీవుల పేర్లు దాగున్నాయి. అవేంటో కనిపెట్టండి చూద్దాం.

1.  స్వరూపా.. మునగకాడలు తీసుకురమ్మంటే, పొట్లకాయలు తెచ్చావేంటి?

2. తప్పు ఎవరిదో.. న్యాయస్థానంలో అందరిముందే తేలుస్తాను చూడండి.

3. విమానం ఎక్కే ముందే పత్రాలన్నీ సరిచూసుకో.. తిరిగొచ్చి తీసుకెళ్లేంత సమయం ఉండదు.

4. చంద్రికా.. కిటికీలు మూసివేయొద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు?

5. ఇక ఊరుకో.. కిలకిలమని ఎంతసేపు నవ్వుతావు?


జవాబులు:

బొమ్మల్లో ఏముందో? : 1.మంచుకొండ 2.కొండచిలువ 3.వడియాలు 4.యాలకులు 5.కుడకలు 6.అటుకులు

కవలలేవి? : 1, 4

పద వలయం : 1.వయసు 2.మనసు 3.నలుసు 4.అలుసు 5.దినుసు 6.సొగసు 7.పులుసు 8.బరుసు

నేనెవర్ని? : 1.కలబంద 2.దారి

వాక్యాల్లో జీవుల పేర్లు : 1.పాము 2.తేలు 3.కోతి 4.కాకి 5.కోకిల

అక్షరాల చెట్టు : ABBREVIATIONS



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని