అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Updated : 09 Dec 2022 05:27 IST




అది ఏది?
మొదటి బొమ్మను పోలి ఉన్నదేదీ?



అవునా.. కాదా..!
ఇక్కడున్న వాక్యాల్లో ఏది అవునో, ఏది కాదో చెప్పగలరా?

1. వంద గ్రాములు అయితే ఒక కిలో.
2. మార్జాలం అంటే పిల్లి అని అర్థం.
3. డీఆర్‌ఎస్‌ అనేది హాకీ క్రీడకు సంబంధించిన పదం.
4. గొంగళి పురుగు వానపాముగా మారుతుంది.
5. చీకటి ఖండం అని యూరప్‌ను పిలుస్తారు.
6. బుధ గ్రహానికీ, భూమికి చంద్రుడు ఉమ్మడి ఉపగ్రహం.


నేనెవర్ని?

1. మూడు అక్షరాల పదాన్ని నేను. ‘కన్ను’లో ఉంటాను కానీ ‘మన్ను’లో లేను. ‘లత’లో ఉంటాను కానీ ‘గీత’లో లేను. ‘శంఖం’లో ఉంటాను కానీ ‘ముఖం’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. ‘తేమ’లో ఉంటాను కానీ ‘జామ’లో లేను. ‘నూనె’లో ఉంటాను కానీ ‘నూరు’లో లేను. ‘టీకా’లో ఉంటాను కానీ ‘కాయ’లో లేను. ‘గని’లో ఉంటాను కానీ ‘ధ్వని’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?



చెప్పుకోండి చూద్దాం!
ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని ఈ పేర్లు వాడకుండా.. వారంలోని అయిదు రోజులను చెప్పగలరా?


జవాబులు 

పట్టికల్లో పదం: సాహసకృత్యాలు
చెప్పుకోండి చూద్దాం!: మొన్న, నిన్న, నేడు, రేపు, ఎల్లుండి
అవునా.. కాదా...!: 1.కాదు 2.అవును 3.కాదు 4.కాదు 5.కాదు 6.కాదు
అక్షరాల చెట్టు: accumulation 
పద వలయం : 1.వణుకు 2.కునుకు 3.చెరకు 4.చురుకు 5.చినుకు 6.తిట్టకు 7.మెతుకు 8.కొడుకు
అది ఏది? : 2
నేనెవర్ని? : 1.కలశం 2.తేనెటీగ
తప్పులే తప్పులు : 1.అంత్యాక్షరి 2.కందిరీగ 3.కిరీటం 4.జింకపిల్ల 5.నీలిమేఘాలు 6.ధన్వంతరి 7.కాకిలెక్కలు 8.నేత్రదానం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని