తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Updated : 07 Jan 2023 05:20 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.





నేనెవర్ని?

1.  నాలుగు అక్షరాల పదాన్ని నేను. ‘అట్టు’లో ఉంటాను కానీ ‘తిట్టు’లో లేను. ‘వేటు’లో ఉంటాను కానీ ‘వేట’లో లేను. ‘కుళ్లు’లో ఉంటాను కానీ ‘ఇళ్లు’లో లేను. ‘మైలు’లో ఉంటాను కానీ ‘మైకు’లో లేను. ఇంతకీ నేను ఎవరిని? 

2. నేను మూడు అక్షరాల పదాన్ని. ‘నెయ్యి’లో ఉంటాను కానీ ‘గొయ్యి’లో లేను. ‘మన్యం’లో ఉంటాను కానీ ‘సైన్యం’లో లేను. ‘చలి’లో ఉంటాను కానీ ‘చట్నీ’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?


పొడుపు కథలు

1. పొట్టి అన్న, పొడుగు తమ్ముళ్లు. వారెవరు?

2. ఇంట్లో ఉండదు.. బయటా ఉండదు. నేల మీద ఉండదూ.. మిద్దె మీద కూడా ఉండదు. అసలు ఇది లేకుండా ఇల్లే ఉండదు. ఏంటది?

3. కదలకుండానే నదిని దాటించగలదు. అదేంటో?


జవాబులు :

తేడాలు కనుక్కోండి : పెంగ్విన్‌ జుట్టు, ఎలుగు నాలుక, కర్ర, ఎలుగు పట్టిన చేప, పెంగ్విన్‌ చేతిలో చేప, స్కార్ఫ్‌

బొమ్మల్లో ఏముందో? : 1.బంగారం 2.గారెలు 3.ఆవులు 4.ఆవులింత 5.తడికెలు 6.కెరటం

పద వలయం : 1.చక్కెర 2.అక్కర 3.తొందర 4.దగ్గర 5.కాకర 6.చివర 7.జాతర 8.తామర

నేనెవర్ని? : 1.అటుకులు 2.నెమలి

పొడుపు కథలు : 1.చేతివేళ్లు 2.కిటికీ 3.వంతెన


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని