అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది.  

Published : 14 Jan 2023 00:46 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది.  ఓసారి ప్రయత్నించండి.


అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


బొమ్మల్లో ఏముందో?

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడి ఖాళీ గడుల్లో నింపగలరా?



అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో ఏవి అవునో, ఏవి కాదో చెప్పగలరా?

1.  చెస్‌ బోర్డులో 64 గడులు ఉంటాయి.
2. భారత ప్రభుత్వానికి చెందిన ఎయిరిండియా.. ఇటీవల టాటా సంస్థ చేతుల్లోకి వెళ్లింది.  
3. మామిడి పండ్లు శీతాకాలంలో మార్కెట్లోకి వస్తాయి.
4. గద్దలకు తీక్షణమైన చూపు ఉంటుంది.
5. దుబాయ్‌ను ఎడారి దేశం అని పిలుస్తుంటారు.
6. తమిళనాడు రాష్ట్ర రాజధాని బెంగళూరు.


నేనెవర్ని?

1. మూడు అక్షరాల పదాన్ని నేను. ‘తప్పు’లో ఉంటాను కానీ ‘తుప్పు’లో లేను. ‘పట్టి’లో ఉంటాను కానీ ‘మట్టి’లో లేను. ‘బస్సు’లో ఉంటాను కానీ ‘బస’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?

2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. ‘కోట’లో ఉంటాను కానీ ‘ఆట’లో లేను. ‘లావా’లో ఉంటాను కానీ ‘కోవా’లో లేను. ‘హక్కు’లో ఉంటాను కానీ ‘వాక్కు’లో లేను. ‘లంచం’లో ఉంటాను కానీ ‘కంచం’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?


పొడుపు కథలు

1.  రెక్కలున్నా ఎగరలేదు.. ఎంత తిరిగినా ఉన్నచోటు నుంచి కదల్లేదు. ఏంటది?

2. చెట్టుకి వేలాడుతుంది కానీ తేనెపట్టు కాదు.. మనం ఎక్కి కూర్చుంటాం కానీ కొమ్మ కాదు.. అదేంటి?

3. అమ్మకి సోదరుడే కానీ అందనంత దూరంలో ఉంటాడు.. ఎవరు?


జవాబులు

అది ఏది? : 3

 బొమ్మల్లో ఏముందో? : 1.తాజ్‌మహల్‌ 2.తారాజువ్వ 3.జున్నుముక్క 4.ముల్లంగి 5.భోగిమంటలు 6.భోజనం 7.నంది 

 నేనెవర్ని? : 1.తపస్సు 2.కోలాహలం

 అవునా.. కాదా..? : 1.అవును 2.అవును 3.కాదు 4.అవును 5.అవును 6.కాదు

అక్షరాల చెట్టు : BIODEGRADABLE

పొడుపు కథలు : 1.ఫ్యాన్‌ 2.ఊయల 3.చందమామ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని