కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Updated : 26 Jan 2023 00:49 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.



క్విజ్‌... క్విజ్‌...!

1.  జాతిపిత అని ఎవరికి పేరు?

2. భారతదేశ మొదటి ప్రధాని ఎవరు?

3. భారత రాజ్యాంగ నిర్మాత అని ఎవరిని పిలుస్తారు?

4. మన జాతీయ పతాకాన్ని ఎవరు రూపొందించారు?

5. ‘స్వరాజ్యం నా జన్మ హక్కు’ అని నినదించింది ఎవరు?

6. ‘నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియా’ అని ఎవరికి పేరు?


నేనెవర్ని?

1.  నేను మూడక్షరాల పదాన్ని. ‘పదం’లో ఉంటాను. ‘పాదం’లో ఉండను. ‘తార’లో ఉంటాను. ‘వీర’లో ఉండను. ‘కంపు’లో ఉంటాను. ‘ఇంపు’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?

2. నేనో రెండక్షరాల పదాన్ని. ‘వేరు’లో ఉంటాను. ‘తీరు’లో ఉండను. ‘మేషం’లో ఉంటాను. ‘మేఘం’లో ఉండను. ఇంతకీ నేనెవరో చెప్పుకోండి చూద్దాం?


పొడుపు కథలు

1. ఇష్టంగా తెచ్చుకుంటారు. చంపి ఏడుస్తారు?

2. అన్నం పెడితే ఎగరదు. పెట్టకపోతే ఎగురుతుంది. ఏమిటది?

3. ఇంట్లో ఉంటే ప్రమోదం, ఒంట్లో ఉంటే ప్రమాదం. ఏంటో తెలుసా?


పట్టికలో పదాలు!

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

గణతంత్రదినోత్సవం, భారతదేశం, జెండావందనం, త్రివర్ణపతాకం, భారత రాజ్యాంగ నిర్మాత, కవాతు, రాజ్యాంగ ప్రవేశిక, రాష్ట్రపతి, ప్రధాని, పావురం, పౌరుడు, ప్రజాస్వామ్యం, ప్రాథమిక హక్కులు.



జవాబులు

కవలలేవి?: 1, 3

అక్షరాల చెట్టు: REPUBLIC DAY PARADE 

క్విజ్‌.. క్విజ్‌..: 1.మహాత్మా గాంధీ  2.జవహర్‌లాల్‌ నెహ్రూ  3.డాక్టర్‌ బీ ఆర్‌.అంబేద్కర్‌  4.పింగళి వెంకయ్య  5.లోకమాన్య బాలగంగాధర్‌ తిలక్‌  6.సరోజిని నాయుడు

నేనెవర్ని?: 1.పతాకం  2.వేషం

పొడుపు కథలు: 1.ఉల్లిపాయ   2.విస్తరాకు  3.పంచదార


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని