తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Updated : 28 Jan 2023 00:57 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


నేనెవర్ని?

1. మూడు అక్షరాల పదాన్ని నేను. ‘ఊపిరి’లో ఉంటాను కానీ ‘పిరికి’లో లేను. ‘లయ’లో ఉంటాను కానీ ‘ఈల’లో లేను. ‘లత’లో ఉంటాను కానీ ‘మమత’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?

2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. ‘దారం’లో ఉంటాను కానీ ‘ఘోరం’లో లేను. ‘పత్తి’లో ఉంటాను కానీ ‘సుత్తి’లో లేను. ‘బరి’లో ఉంటాను కానీ ‘బలి’లో లేను. ‘కంచు’లో ఉంటాను కానీ ‘మంచు’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?


అక్కడా.. ఇక్కడా..

ఇక్కడ కొన్ని వాక్యాలూ, వాటి మధ్యలో ఖాళీలూ ఉన్నాయి. మొదటి గడుల్లో నప్పే పదమే, తర్వాతి వాటిల్లోనూ సరిపోతుంది. అవేంటో కనుక్కోండి చూద్దాం.


క్విజ్‌.. క్విజ్‌..!

1. అరుణ గ్రహం అని దేనికి పేరు?  

2. ఆస్ట్రేలియా పేరు వినగానే గుర్తుకువచ్చే జంతువు ఏది?

3. దేశ అత్యున్నత న్యాయస్థానం ఏది?

4. రాష్ట్ర ప్రథమ పౌరుడు లేదా పౌరురాలిగా ఎవరిని పిలుస్తుంటారు?  

5. టెస్టు క్రికెట్‌లో ఏ రంగు బంతికి వాడతారు?


జవాబులు

తేడాలు కనుక్కోండి : 1.చెట్టు 2.స్కార్ఫ్‌ 3.స్నోమ్యాన్‌ చేయి 4.గుండీలు 5.పక్షి 6.టోపీ

బొమ్మల్లో ఏముందో? : 1.చిలగడదుంపలు 2.గగనం 3.పెనం 4.పెరుగువడ 5.గులాబీతోట 6.దవడ

నేనెవర్ని? : 1.ఊయల 2.దాపరికం

అక్కడా.. ఇక్కడా.. : 1.వరి 2.కల 3.గతి 4.సాయం 5.కంది 6.దానం

క్విజ్‌.. క్విజ్‌..! : 1.అంగారకుడు 2.కంగరూ 3.సుప్రీం కోర్టు 4.గవర్నర్‌ 5.ఎరుపు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని