అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.

Published : 03 Mar 2023 00:10 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.


నేనెవర్ని?

1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. ‘అన్న’లో ఉంటాను కానీ ‘వెన్న’లో లేను. ‘నుయ్యి’లో ఉంటాను కానీ ‘గొయ్యి’లో లేను. ‘మక్కువ’లో ఉంటాను కానీ ‘ఎక్కువ’లో లేను. ‘తిక్క’లో ఉంటాను కానీ ‘వక్క’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?

2. నేను అయిదక్షరాల పదాన్ని. ‘భారం’లో ఉంటాను కానీ ‘ఘోరం’లో లేను. ‘రవ్వ’లో ఉంటాను కానీ ‘మువ్వ’లో లేను. ‘తట్ట’లో ఉంటాను కానీ ‘బుట్ట’లో లేను. ‘దేహం’లో ఉంటాను కానీ ‘దాహం’లో లేను. ‘శంఖం’లో ఉంటాను కానీ ‘దుఃఖం’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?


పొడుపు కథలు

1.  అబద్ధం అంటే తెలియనిది. ఏంటది?

2. తల ఉన్నా.. కాళ్లు లేనిదేంటి?

3. తడిస్తే గుప్పెడు.. ఎండితే బుట్టెడు. అదేంటబ్బా?


సాధించగలరా?

ఇక్కడ అగ్గిపుల్లలతో ఓ సమీకరణం ఉంది. కానీ, అది తప్పు. వాటిలో ఏవైనా మూడు పుల్లలను తొలగించి మీరు సరిజేయగలరా?




జవాబులు 

అక్షరాల చెట్టు :  COMMUNICATOR 

నేనెవర్ని? : 1.అనుమతి  2.భారతదేశం

పొడుపు కథలు : 1.అద్దం  2.గుండుసూది  3.దూది

సాధించగలరా? : 7-4=3

బొమ్మల్లో ఏముందో? : 1.సెలయేరు  2.మావిచిగురు  3.హిమాలయాలు  4.ఆలుగడ్డలు  5.గెలుపు  6.పుచ్చకాయలు

అది ఏది? : 3  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని