అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Published : 10 Mar 2023 00:58 IST


కవలలేవి?
ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి?


సాధించగలరా?

ఇక్కడ ఒక్కో గీతపైన మూడు రూపాయి బిళ్లల చొప్పున ఉన్నాయి. ఇంకో రెండు బిళ్లలను జత చేసి, మరో అయిదు గీతలు వచ్చేలా చేయాలి. ప్రతి గీతపైన మూడే బిళ్లలు ఉండాలనేది నిబంధన.


పొడుపు కథలు
1.  కదలవు కానీ పెరుగుతాయి.. తరుగుతాయి. ఏంటవి?
2. తిండి తినకుండా, నిద్రపోకుండా ఇంటికి కాపలా కాస్తుంది. ఎవరెంత కొట్టినా అరవలేదు. అదేంటి?


నేనెవర్ని?

1.  మూడు అక్షరాల పదాన్ని నేను. ‘ఇల్లు’లో ఉంటాను కానీ ‘విల్లు’లో లేను. ‘అత్త’లో ఉంటాను కానీ ‘అట్టు’లో లేను. ‘కోడి’లో ఉంటాను కానీ ‘కోడె’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. ‘మాట’లో ఉంటాను కానీ ‘కోట’లో లేను. ‘యాత్ర’లో ఉంటాను కానీ ‘మాత్ర’లో లేను. ‘జాలి’లో ఉంటాను కానీ ‘ఆకలి’లో లేను. ‘లంచం’లో ఉంటాను కానీ ‘కంచం’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?జవాబులు :
కవలలేవి? : 1, 4
అక్షరాల చెట్టు : QUADRILATERAL పదవలయం : 1.జాతకం 2.జ్ఞాపకం 3.కనకం 4.శునకం 5.అమ్మకం 6.పుస్తకం 7.పతకం 8.నరకం
నేనెవర్ని? : 1.ఇత్తడి 2.మాయాజాలం పొడుపు కథలు : 1.మెట్లు 2.తాళం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు