ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి.

Updated : 19 Mar 2023 03:07 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి.


పదవలయం

ఈ ఆధారాల సాయంతో వృత్తంలోని ఖాళీలను నింపండి. అన్నీ ‘యం’ అక్షరంతోనే ముగుస్తాయి.

1. గెలుపు.. మరోలా.. 2. ప్రమాదం 3. సందేహం 4. లక్ష్యం, గమ్యం 5. ఆదుకోవడం, సాయం 6. వృత్తం 7. చేతికి ధరించేది 8. సిగ్గు


వాక్యాల్లో వ్యక్తుల పేర్లు

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటి మధ్యలో అక్కడక్కడా వ్యక్తుల పేర్లు దాగి ఉన్నాయి. జాగ్రత్తగా పరిశీలించి,వాటిని కనిపెట్టండి చూద్దాం.

1. సోదరా.. ముళ్లపొదల్లో పడిపోయిన బంతిని నేనే తీసుకొచ్చా.
2. ఏటా జనవరి 26న పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది.
3. డబ్బుతో కాకుండా మంచి పనులతోనే కీర్తి ప్రతిష్ఠలు వస్తాయని తెలుసుకోవాలి.
4. కొబ్బరికాయ, మునగాకు తీసుకొచ్చేందుకు దుకాణానికి వెళ్లాం.  
5. ఇదే మన గోదావరి.. తికమక పడకుండా జాగ్రత్తగా వివరాలు రాసుకో.  
6. తాతయ్యా.. ఆ పంచాంగం చూసి, తనది ఏ నక్షత్రమో కాస్త చెబుతారా!  


నేనెవర్ని?

1. మూడు అక్షరాల పదాన్ని నేను ‘సితార’లో ఉంటాను కానీ, ‘ధ్రువతార’లో లేను. ‘గని’లో ఉంటాను కానీ ‘గది’లో లేను. ‘మాట’లో ఉంటాను కానీ ‘మూట’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?

2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. ‘గుడి’లో ఉంటాను కానీ ‘బడి’లో లేను. ‘గణన’లో ఉంటాను కానీ ‘నగ’లో లేను. ‘పాత్ర’లో ఉంటాను కానీ ‘మాత్ర’లో లేను. ‘కంఠం’లో ఉంటాను కానీ ‘పైకం’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?




జవాబులు: 

ఏది భిన్నం? : 1

పదవలయం : 1.విజయం 2.అపాయం 3.సంశయం 4.ఆశయం 5.సహాయం 6.వలయం 7.కడియం 8.బిడియం

వాక్యాల్లో వ్యక్తుల పేర్లు : 1.రాము 2.పద్మ 3.కీర్తి 4.యమున 5.రితిక 6.నక్షత్ర

నేనెవర్ని? : 1.సినిమా 2.గుణపాఠం

అక్షరాల చెట్టు : FAITHFULNESS


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని