పట్టికల్లో పదం!

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే అర్థవంతమైన పదం వస్తుంది. 

Published : 17 Jun 2024 00:05 IST

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనుక్కోండి చూద్దాం!


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం.


తప్పులే తప్పులు!

ఇక్కడ కొన్ని పదాలున్నాయి. వాటిలో అక్షర దోషాలున్నాయి. మీరు వాటిని సరిచేసి రాయగలరా?


నేనెవర్ని?

1. నేను మూడక్షరాల పదాన్ని. ‘చెమ్మ’లో ఉంటాను. ‘కొమ్మ’లో ఉండను. ‘రుషి’లో ఉంటాను. ‘కృషి’లో ఉండను. ‘గోవు’లో ఉంటాను. ‘గోడ’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?

2. నేను అయిదక్షరాల పదాన్ని. ‘సత్యం’లో ఉంటాను. ‘నిత్యం’లో ఉండను. ‘మనం’లో ఉంటాను. ‘వనం’లో ఉండను. ‘మాయ’లో ఉంటాను. ‘మాను’లో ఉండను. ‘పాదం’లో ఉంటాను. ‘మోదం’లో ఉండను. ‘వల’లో ఉంటాను. ‘వరం’లో ఉండను. ‘వాన’లో ఉంటాను. ‘వాతం’లో ఉండను. నేనెవరో చెప్పుకోండి చూద్దాం? 


అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమవుతుంది. ఓసారి ప్రయత్నించండి.


జవాబులు

పట్టికల్లో పదం!: లోహవిహంగం
రాయగలరా?: 1.క్రమశిక్షణ 2.అణచివేత 3.ఫిరంగిగుండు 4.దినపత్రిక 5.యువతరం 6.అవరోధం 7.ఆత్మవిశ్వాసం 8.వాడుక భాష 9.ప్రజాగళం 10.రచ్చబండ 11.పక్షపాతి 12.రాయబారి 13.ఫలహారం 14.ప్రతిరూపం 15.ప్రజాస్వామ్యం
తప్పులే తప్పులు!: 1.రాజధాని 2.కర్మాగారం 3.కృషీవలుడు 4.హాలికుడు 5.పరిపాలన 6.ధాన్యాగారం 7.క్రీడాకారుడు 8.ప్రమాదం 
నేనెవర్ని?: 1.చెరువు 2.సమయపాలన
అది ఏది?: 2
అక్షరాల చెట్టు: MULTIBILLIONAIRE


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు