భేష్‌.. హేమేశ్‌!

ఎవరైనా కష్టపడి గొప్ప స్థాయికి చేరుకుంటే వాళ్ల మీద బయోపిక్‌ తీస్తారు. అందులో వాళ్ల జీవితాన్ని కళ్లకు కడతారు. అది సరే! కానీ పదమూడేళ్ల పిల్లాడి మీద బయోపిక్‌ తీయాలనుకుంటే? అప్పుడే ఏం సాధించేశాడు.. అనే ప్రశ్న వస్తుంది. నిజమే.. కానీ

Updated : 03 May 2021 06:33 IST

ఎవరైనా కష్టపడి గొప్ప స్థాయికి చేరుకుంటే వాళ్ల మీద బయోపిక్‌ తీస్తారు. అందులో వాళ్ల జీవితాన్ని కళ్లకు కడతారు. అది సరే! కానీ పదమూడేళ్ల పిల్లాడి మీద బయోపిక్‌ తీయాలనుకుంటే? అప్పుడే ఏం సాధించేశాడు.. అనే ప్రశ్న వస్తుంది. నిజమే.. కానీ ఏమీ సాధించకపోతే తీయరు కదా! అదీ నిజమేనండోయ్‌ అంటారా.. మరి ఇంతకీ ఎవరా పిల్లాడు, ఏంటా కథ తెలుసుకుందామా!
చదలవాడ హేమేశ్‌ వయసు 13 ఏళ్లు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో నివాసం. హేమేశ్‌ వాళ్ల బామ్మ మతిమరుపు (అల్జీమర్స్‌)తో బాధపడుతోంది. ఆమె పరిస్థితి చూస్తున్న హేమేశ్‌కు ఓ పరిష్కారం కనుక్కోవాలనే ఆలోచనొచ్చింది. అంతే.. ‘స్మార్ట్‌ రిస్ట్‌ బ్యాంకు’ అనే పరికరాన్ని తయారుచేశాడు. దాన్ని చేతికి ధరిస్తే అది రోగి పల్స్‌, బీపీని అంచనా వేస్తుంది. వాటిలో ఏవైనా తేడాలుంటే వెంటనే ఆటోమేటిక్‌గా డాక్టర్లకు సమాచారం అందిస్తుంది. ప్రతి రోజు వైద్యుడికి రిపోర్టు అందిస్తుంది. దానికి ఒక బుజ్జి కెమెరా కూడా అమర్చాడు హేమేశ్‌. అంతేకాదు.. ‘స్మార్ట్‌ పిల్‌బాక్స్‌’ కూడా ఉంటుంది. సరైన సమయానికి మందులు అందించేలా తయారు చేశాడు.
వరించిన అవార్డులు
2019వ సంవత్సరం  హైదరాబాద్‌లో ‘ఐఐఎఫ్‌’ (ఇంటర్నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫెయిర్‌)లో రెండు అంతర్జాతీయ పురస్కారాలు, ఒక బంగారు పతకం వరించాయి. ఆరు జాతీయ అవార్డులూ గెలుపొందాడు. తనిప్పుడు ‘తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌’ (టీఎస్‌ఐసీ)లో సభ్యుడు. ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాన్నీ సాధించాడు. అసలు హేమేశ్‌ ఈ స్థాయికి రావడానికి కారణం, తన స్ఫూర్తిదాతలు, తన కుటుంబ నేపథ్యం, చదువు వంటి విషయాలన్నీ తెలుసుకోవాలని అనుకుంటున్నారా! అయితే ఇంకొన్ని రోజులు ఆగండి.. ఎందుకంటే మనోడి విజయ ప్రస్థానాన్ని సినిమాగా తీయబోతున్నారట. అప్పుడు ఏకంగా తెర మీదే తన ప్రయాణాన్ని చూడొచ్చు.  ఇవండీ.. మన బాల శాస్త్రవేత్త హేమేశ్‌ విశేషాలు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని