సాధనతో సాధించింది

ఏదైనా నేర్చుకోవాలంటే దానికి పట్టుదల ముఖ్యం. సాధించాలనే తపన ఉంటే ఎలాంటి లక్ష్యాన్ని అయినా చేరుకోగలం....

Updated : 07 Jul 2021 02:33 IST

ఏదైనా నేర్చుకోవాలంటే దానికి పట్టుదల ముఖ్యం. సాధించాలనే తపన ఉంటే ఎలాంటి లక్ష్యాన్ని అయినా చేరుకోగలం. అదే నిరూపించింది ఇండోర్‌కు చెందిన పలక్‌ శర్మ. ఆ సంగతులన్నీ మీకోసం.

దమూడేళ్ల పలక్‌ శర్మ, ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతోంది. చిన్నప్పట్నుంచీ ఆటలంటే ఇష్టం. ఏ పనిచేసినా నిబద్ధతతో చేస్తుంది. ఈ చిన్నారి తనకు స్విమ్మింగ్‌ మీద ఉన్న ఆసక్తిని అమ్మానాన్నలకు చెప్పింది. వాళ్లూ తనను ప్రోత్సహిస్తూ, ఈతలో శిక్షణ ఇప్పించారు. అలా ఎనిమిదేళ్ల వయసు నుంచే ఈతలో మెలకువలు నేర్చుకుంది.

కలెక్టర్‌నే ఒప్పించి..

అంతేనా.. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఈత పోటీల్లోనూ పాల్గొని బహుమతులు గెలుచుకుంది. 2019లో ఏషియన్‌ ఏజ్‌ గ్రూప్‌ ఛాంపియన్‌షిప్‌ అందుకుంది. ఈ ఘనత సాధించిన మొదటి బాలికా డైవర్‌ ఈమెనే! కరోనా మొదలైనప్పుడు మొదటి లాక్‌డౌన్‌లో స్విమ్మింగ్‌ పూల్‌ శిక్షణ ఆపేశారు. నిరంతర సాధన చేసే ఈ చిన్నారి శిక్షణకేంద్రం మూసేయగానే ఇంటికి వెళ్లిపోలేదు. వెంటనే జిల్లా కలెక్టర్‌ను కలిసి అనుమతి తీసుకుని తన శిక్షణను కొనసాగించింది. అంత పట్టుదలగా సాధన చేస్తుంది కనుకనే 13 ఏళ్లకే 12 బంగారు పతకాలు, 4 వెండి పతకాలు సాధించింది. ఇంత చిన్న వయసులో అంత గొప్ప ఘనత సొంతం చేసుకుందంటే నిజంగా గ్రేట్‌ కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని