ఈ విజయానికి 102 మెట్లు!
సాధారణంగా పిల్లలు మెట్లు దిగేటప్పుడు ఎక్కడ పడిపోతారో అని జాగ్రత్తగా తీసుకెళ్తారు అమ్మానాన్న. కానీ ఈ బుడతడ్ని చూశారా! చక్రాసనంలో మెట్లు దిగుతూ ఔరా అనిపిస్తున్నాడు. ప్రశంసలు అందుకోవడంతో పాటు రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నాడు. మరి తనెవరో తెలుసుకుందామా..! మీరు మాత్రం ఈ విన్యాసాలను అస్సలు అనుకరించకండి సరేనా.. నేస్తాలూ!
యోగాసనాల్లో చక్రాసనం చాలా కష్టం. అదీ కాక ఆ చక్రాసన స్థితిలో మెట్లు దిగడం అంటే చాలా నైపుణ్యం ఉండాలి. ఎంతో కఠోర శ్రమ, సాధన అవసరం. అలాంటిది ఏడేళ్ల వయసులో ఇందులో పట్టు సాధించాడు ఈ నేస్తం. తనుండే భవనంలోని అయిదవ అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌కు అంటే 102 మెట్లు కేవలం 1నిమిషం 13 సెకన్లలో చక్రాసనంలో ఉండి దిగాడు. అన్నేసి మెట్లు అంత తక్కువ టైమ్‌లో దిగడం చూసి అందరూ అవాక్కయ్యారు. తన ప్రతిభకు గానూ ‘వరల్డ్‌వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం కూడా పొందాడు.
సరదాగా మొదలుపెట్టి!
నాగ్‌పూర్‌లోని బాజీప్రభు నగర్‌కు చెందిన రాఘవ్ సాహిల్ బాంగ్డే, వయసు ఏడేళ్లు. చిన్నప్పట్నుంచీ రాఘవ్ చాలా చురుగ్గా ఉండేవాడు. తనకు తానుగా సరదాగా వెనక్కి పల్టీలు కొడుతూ విన్యాసాలు చేసేవాడు. తన ఆసక్తిని గమనించిన అమ్మానాన్న నాగ్‌పూర్‌లోని విదర్భ కరాటే అసోసియేషన్‌కు చెందిన కోచ్ విజయ్ ఘిచారే దగ్గర శిక్షణకు పంపారు. రోజుకు అందులో నాలుగు గంటలు సాధన చేసేవాడు. తన ఏకాగ్రత, పట్టుదల చూసి కోచ్ కూడా ఆశ్చర్యపోయేవారు. అలా అయిదేళ్ల వయసులోనే ఒక్క నిమిషంలో 125 రాతి పలకల్ని(టైల్స్) పగలకొట్టాడు. తర్వాత అక్కడ యోగాసనాల్లో భాగంగా చక్రాసనంలో కూడా పట్టు సాధించి రెండేళ్ల వ్యవధిలోనే మళ్లీ ఈ రికార్డు సాధించాడు. ఇంత చిన్న వయసులో విభిన్న రీతిలో ప్రతిభ కనపరచడం నిజంగా గ్రేట్ కదూ! మరింకేం నేస్తానికి అభినందనలు తెలిపేయండి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
చనిపోయాడనుకొని ఖననం చేశారు.. కానీ స్నేహితుడికి వీడియో కాల్!
-
Ap-top-news News
Andhra News: పన్నులు వసూలు చేసే వరకూ సెలవుల్లేవ్
-
India News
JEE Main: జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
World News
Earthquake: ఈ దేశాల్లో నిత్యం భూప్రళయాలే
-
India News
Punjab: చేతులతో నాలుగు బుల్లెట్ బైక్‌లను ఆపిన యువకుడు
-
India News
Marriage: వరుడికి 65.. వధువుకు 23