ఆల్‌రౌండర్‌ అహుజా..!

ఓ నేస్తం తన ప్రతిభతో ప్రశంసలు పొందుతున్నాడు. రికార్డులు మీద రికార్డులు కొడుతూ అందరూ అవాక్కయ్యేలా చేస్తున్నాడు. ఇంతకీ ఎవరా నేస్తం, తెలుసుకుందాం రండి.లక్నోకి చెందిన వ్యోమ్‌ అహుజా, వయసు 11 ఏళ్లు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్నాడు.

Published : 13 Dec 2021 00:08 IST

ఓ నేస్తం తన ప్రతిభతో ప్రశంసలు పొందుతున్నాడు. రికార్డులు మీద రికార్డులు కొడుతూ అందరూ అవాక్కయ్యేలా చేస్తున్నాడు. ఇంతకీ ఎవరా నేస్తం, తెలుసుకుందాం రండి.

క్నోకి చెందిన వ్యోమ్‌ అహుజా, వయసు 11 ఏళ్లు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్నాడు.

రెండేళ్ల వయసులోనే..

వ్యోమ్‌కు సంగీతమంటే చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని గ్రహించిన అమ్మానాన్న తనకు శిక్షణ ఇప్పించారు. అలా రెండేళ్ల వయసులోనే ఫ్లూట్‌ వాయించి మొదటిసారిగా రికార్డు అందుకున్నాడు వ్యోమ్‌. ఇక అప్పట్నుంచీ చదువుకుంటూనే ఇటు సంగీత సాధన చేసేవాడు. అలా వ్యోమ్‌.. ఫ్లూట్‌, మౌత్‌ ఆర్గాన్‌, తబలా వంటి 9 సంగీత సాధనాలను వాయించడం నేర్చుకున్నాడు. అలా వాయిస్తూ 300కు పైగా ప్రదర్శనలు కూడా ఇచ్చాడు. ఇందుకు గానూ ప్రధాన్‌మంత్రి బాలశక్తి పురస్కారాన్నీ అందుకున్నాడు.

అన్నింటా ప్రతిభ..

తన ప్రతిభతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 29 సార్లు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించేశాడు. ఇంతేకాదు మూడు సార్లు ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో కూడా పేరు ఎక్కించేసుకున్నాడు. ప్రస్తుతం బ్రెయిన్‌ విటా గేమ్‌ని 24 సెకన్లలో ఆడి మళ్లీ ఇంకో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సంగీతం, జనరల్‌ నాలెడ్జ్‌, జ్ఞాపకశక్తివంటి వాటిల్లో ప్రతిభ కనబరుస్తూ 11 ఏళ్లు వచ్చేసరికి ఏకంగా 35 రికార్డులు అందుకుని ఔరా అనిపించుకుంటున్నాడు. నిజంగా ఇంత చిన్న వయసులో అన్ని రికార్డులు తెచ్చుకోవడమంటే గ్రేట్‌ కదా! మరింకేం వ్యోమ్‌ను అభినందించేయండి...


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని