వయసు చిన్న.. ప్రతిభ మిన్న!
గాజు వస్తువులు పట్టుకొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం కదా! ఎక్కడ పగిలిపోతుందో అని అమ్మవాళ్లు అసలు మన చేతికే ఇవ్వరు. అలాంటిది గాజు పలకల మీద ఓ చిన్నారి అవలీలగా పెయింటింగ్ వేసేస్తోంది. తను వేసే పెయింటింగ్స్‌తో అవార్డులు కూడా అందుకుంటోంది. ఎవరా చిన్నారి? తెలుసుకునేందుకు చదివేయండి..
ఆ చిన్నారి పేరు రియా బాలోటియా. వయసు మూడేళ్లు. ఉండేది గురుగావ్‌లో.
భయపడేది కాదు..
రియాకు బొమ్మలేయడమంటే చాలా ఇష్టం. పేపర్ పట్టుకొని ఏదో ఒకటి గీస్తూ ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడమంటే ఆసక్తి. తన ఇష్టాన్ని గ్రహించిన అమ్మానాన్న రియాకు పెయింటింగ్‌లో శిక్షణ ఇచ్చారు. మూడేళ్లకే అద్భుతమైన బొమ్మలు గీయడం నేర్చేసుకుంది రియా. సొంతంగా రియా పెయింటింగ్ వేయడం చూసిన అమ్మానాన్న గాజు పలకల మీద కూడా పెయింటింగ్ వేయడం నేర్పేశారు. రియా కూడా చక్కగా కూర్చుని తనకు నచ్చినట్లు పెయింటింగ్ వేయడం మొదలు పెట్టింది. మొదట్లో గాజు పలకలు ఎక్కడ పగలగొట్టేస్తుందో అని భయపడ్డారు అమ్మానాన్న. కానీ రియా ఏమాత్రం భయపడకుండా పెయింటింగ్ వేసేది. అలా అలా 100కు పైగానే గ్లాస్ పెయింటింగ్స్ వేసేసింది. ఆ పెయింటింగ్స్ చూసిన వాళ్లు ఎవరో పెద్దవాళ్లు వేశారేమో అనుకుంటారు కూడా.
సోనూసూద్ మెచ్చుకున్నారు..
తన పెయింటింగ్స్‌ను ఫేస్బుక్లో షేర్ చేస్తే భలేగా ప్రశంసలు వచ్చేవి. దాంతో తన పెయింటింగ్స్ అన్నింటిని పోర్చుగల్‌లోని ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనకు పెట్టారు అమ్మానాన్న. అక్కడ ప్రదర్శరనలో రియా పెయింటింగ్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అంతేకాదు అక్కడకు వచ్చిన ప్రముఖ నటుడు సోనూసూద్‌కు అవి చాలా నచ్చేశాయట. దాంతో రియా పెయింటింగ్స్ అన్నింటిని ‘సోనూసూద్ చారిటబుల్ ట్రస్ట్’ కొనేసిందన్నమాట. అలా రియా ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. అంతేనా ‘వరల్డ్ రికార్డ్స్ ఇండియా’లో కూడా రియా పేరు నమోదు చేసేశారు. ఇంత చిన్న వయసులో అంతలా పేరు తెచ్చుకున్న రియా గ్రేట్ కదా! మరింకేం అభినందనలు తెలిపేయండి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Rahul Gandhi: మంచులో రాహుల్-ప్రియాంక ఫైట్.. వీడియో వైరల్
-
India News
Congress: చైనా విషయంలో కేంద్రానిది DDLJ వ్యూహం: కాంగ్రెస్ కౌంటర్
-
Movies News
Jayasudha: ఆ భయంతోనే అజిత్ సినిమాలో నటించలేదు: జయసుధ
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Chintakayala Vijay: సీఐడీ విచారణకు హాజరైన తెదేపా నేత చింతకాయల విజయ్
-
Movies News
Jamuna: అలనాటి నటి జమున బయోపిక్‌లో మిల్కీ బ్యూటీ..!