భళారే అబ్దుల్!
మామూలు రికార్డులు ఎవరైనా కొడతారు. కానీ గిన్నీస్ ప్రపంచ రికార్డు పొందడం అంటే నిజంగా గొప్పే. అంతటి ఘనతను చిన్న వయసులోనే సాధించాడు ఓ నేస్తం. ఆ నేస్తమెవరో ఎలా సాధించాడో తెలుసుకుందామా!
ఆ నేస్తమే శ్రీనగర్‌కు చెందిన అబ్దుల్ అలీం. వయసు పదేళ్లు. ప్రస్తుతం ఆరో తరతి చదువుతున్నాడు. అమ్మ ఇక్రా, నాన్న ఐజాజ్ అహ్మద్
విభిన్నం ఈ నేస్తం..
అబ్దుల్ చాలా చురుకైన పిల్లాడు. అయితే అందరి పిల్లలకు భిన్నంగా ఉంటాడు అబ్దుల్. ఎందుకంటే చాలామంది ఖాళీ సమయం దొరికితే టీవీ చూడటం కానీ ఆన్లైన్ గేమ్స్ ఆడటం కానీ చేస్తారు. కానీ అబ్దుల్ మాత్రం అవేం చేయడు. ముందుగా చదువుకుంటాడు.. ఇంకా సమయముంటే సరాసరి వాళ్లమ్మ దగ్గరికి వెళ్లి ఏదైనా కొత్త విషయం చెప్పమని అడుగుతుంటాడు. అలా ప్రపంచంలో జరిగే వాటి గురించి చిన్న వయసునుంచే తెలుసుకోవడం మొదలు పెట్టాడు అబ్దుల్. అంతేకాదు మిగతా సమయంలో వివిధ దేశాల కరెన్సీ, నాణేలు సేకరించేవాడు.
అదే ఆసక్తితో..
లాక్ డౌన్ సమయంలో అబ్దుల్‌కు బాగా బోర్ కొట్టింది. అటు స్కూల్ కూడా లేకపోవడంతో ఇంట్లో ఉన్న భూగోళం పట్టుకుని వాళ్లమ్మ దగ్గరకి వెళ్లాడు. వాళ్లమ్మ ఆశ్చర్యంగా.. ‘అదెందుకు అబ్దుల్’ అని అడిగితే ప్రపంచ దేశాల గురించి, వాళ్లు వాడే కరెన్సీ.. ఇలా అన్ని విషయాలు చెప్పమని అడిగాడట. ఇక అప్పటి నుంచి ప్రపంచంలోని దేశాలు, రాజధానులు కరెన్సీ ఇలా అన్నీ చెబుతూ వచ్చారు వాళ్లమ్మ. అవన్నీ కంఠతా నేర్చుకున్నాడు అబ్దుల్. ఒకరోజు ఆనంద్‌శ్రీ ఆర్గనైజేషన్ నిర్వహించిన ఆన్లైన్ షోలో మన నేస్తం పాల్గొన్నాడు. దానికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ అధికారులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఆ పోటీలో పాల్గొని 9.26 నిమిషాల్లో 195 దేశాల జెండాలు, దేశాలు, వాటి రాజధానులు, కరెన్సీలను గడగడా చెప్పేశాడు. తన జ్ఞాపకశక్తికి ఆశ్చర్యపోతూ గిన్నీస్ ప్రపంచ రికార్డులో అబ్దుల్ పేరు నమోదు చేశారు. ఇక అబ్దుల్ ప్రస్తుతం రోబోటిక్స్ మీద కోర్సు చేస్తున్నాడు. జీవితంలో ఏదైనా సాధించి గొప్ప పేరు తెచ్చుకోవడమే తన లక్ష్యమంటున్నాడు. మరి అబ్దుల్‌ను అభినందిస్తూ.. ఆల్ ద బెస్ట్ చెప్పేద్దామా!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
SC: బీబీసీ డాక్యుమెంటరీ వివాదం.. విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
-
India News
Congress: చైనా విషయంలో కేంద్రానిది DDLJ వ్యూహం: కాంగ్రెస్ కౌంటర్
-
India News
Rahul Gandhi: మంచులో రాహుల్-ప్రియాంక ఫైట్.. వీడియో వైరల్
-
Movies News
Jayasudha: ఆ భయంతోనే అజిత్ సినిమాలో నటించలేదు: జయసుధ
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Chintakayala Vijay: సీఐడీ విచారణకు హాజరైన తెదేపా నేత చింతకాయల విజయ్