మనసున్న నేస్తం!
అమ్మానాన్న మనకి పాకెట్ మనీ ఇస్తే ఏం చేస్తాం. ఏముంది చిరుతిళ్లు కొనుక్కుంటాం లేదా దాచుకుంటాం కదా! కానీ ఓ నేస్తం, ఓ మంచి పని చేశాడు. ఆ విషయాన్ని వాళ్లమ్మ సోషల్ మీడియాలో చెప్పగా అది బాగా వైరల్ అయ్యింది. ఇంతకీ ఆ నేస్తమెవరు? ఏం చేశాడు. తెలుసుకునేందుకు చదివేయండి మరి..
సింగపూర్‌కు చెందిన షాన్ ఇహాన్. వయసు 11 ఏళ్లు. ఇహాన్ వయసులో చిన్నవాడే కానీ మనసు మాత్రం చాలా పెద్దది. ఎందుకంటారా! ఇహాన్ స్కూల్లో రోజూ సాయంత్రం క్యాంటీన్‌కు తన ఫ్రెండ్‌తో కలిసి వెళ్లేవాడు. అయితే ఆ క్యాంటీన్లో అందరూ స్నాక్స్, డ్రింక్స్ తీసుకుంటుంటే.. తన ఫ్రెండ్ మాత్రం కేవలం డ్రింక్‌తో సరిపెట్టుకొనేవాడు. ఇహాన్‌కు తన స్నేహితుడు డబ్బుల్లేక తినట్లేదని అర్థమైంది.
స్నేహితుడి కోసం..
కొన్ని రోజులకు ఇహాన్‌కు ఓ ఆలోచన వచ్చింది. వాళ్లమ్మ రోజూ ఇహాన్‌కు పాకెట్ మనీ ఇచ్చేవారు. వాటిని దాచుకుని తన ఫ్రెండ్‌కు ఇచ్చేవాడు ఇహాన్. వాటితో ఆ అబ్బాయి స్నాక్స్ కొనుక్కుని తినేవాడు. అయితే ఇదంతా గమనించిన టీచర్ అతనికి డబ్బులిస్తున్నావేంటి అని అడిగితే అప్పుగా ఇచ్చాను అనేవాడు. వాళ్లమ్మకు కూడా అదే మాట చెప్పేవాడు ఇహాన్.
నెటిజన్ల సెల్యూట్ !
కానీ టీచర్‌కు సందేహం వచ్చి పదే పదే అడుగుతుంటే, తిరిగి తీసుకోవడం ఇష్టం లేని ఇహాన్.. టీచర్‌కు తెలియడం కోసం కేవలం 20 సెంట్లు(13 రూపాయలు) వెనక్కి తీసుకుని, తన ఫ్రెండ్ మొత్తం ఇచ్చేశాడని చెప్పాడు. టీచర్‌కు తెలిసింది కదా అమ్మకు చెబుతారేమో అని, తనే ముందుగా జరిగినదంతా వాళ్లమ్మకు చెప్పేశాడు. ఇంత చిన్న వయసులోనే అంతలా ఆలోచించిన తన కొడుకుని చూసి ముద్దు చేసింది వాళ్లమ్మ. అంతేకాదు కొడుకు చేసిన పనిని నలుగురికీ తెలియజెప్పాలని, అందరిలో స్ఫూర్తిని నింపాలని తన ఇన్‌స్టాలో జరిగినదంతా రాసుకొచ్చింది. అది చూసిన నెటిజన్లు ఇహాన్‌కు సెల్యూట్ చేస్తున్నారు. ఇహాన్ మంచితనాన్ని పొగుడుతున్నారు. అదీ సంగతి. ఇహాన్ మనసు నిజంగా గొప్పది కదా!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
చనిపోయాడనుకొని ఖననం చేశారు.. కానీ స్నేహితుడికి వీడియో కాల్!
-
Ap-top-news News
Andhra News: పన్నులు వసూలు చేసే వరకూ సెలవుల్లేవ్
-
India News
JEE Main: జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
World News
Earthquake: ఈ దేశాల్లో నిత్యం భూప్రళయాలే
-
India News
Punjab: చేతులతో నాలుగు బుల్లెట్ బైక్‌లను ఆపిన యువకుడు
-
India News
Marriage: వరుడికి 65.. వధువుకు 23