పట్టుదలతో పసిడి పతకం

నేస్తాలూ! మన తెలుగు తేజం రోలర్‌ స్కేటింగ్‌లో అద్భుత ప్రతిభ కనబరిచాడు. చిన్నవయసులోనే జాతీయ స్థాయి రోలర్‌ స్కేటింగ్‌లో బంగారు పతకాన్ని అందించాడు. ఆ నేస్తమెవరా! ఆ వివరాలకు చదివేయండి..

Updated : 25 Dec 2021 03:15 IST

నేస్తాలూ! మన తెలుగు తేజం రోలర్‌ స్కేటింగ్‌లో అద్భుత ప్రతిభ కనబరిచాడు. చిన్నవయసులోనే జాతీయ స్థాయి రోలర్‌ స్కేటింగ్‌లో బంగారు పతకాన్ని అందించాడు. ఆ నేస్తమెవరా! ఆ వివరాలకు చదివేయండి..

హైదరాబాద్‌కు చెందిన కృష్ణ నిక్షిత్‌. వయసు ఆరేళ్లు. ప్రస్తుతం ఒకటో తరగతి చదువుతున్నాడు.

ఆసక్తితో అడుగు

నిక్షిత్‌కు సరదాగా రోలర్‌ స్కేటింగ్‌ నేర్పించారు అమ్మానాన్న. ఆడుకుంటూనే స్కేటింగ్‌ మీద ఇష్టాన్ని పెంచుకున్నాడు నిక్షిత్‌. అందుకే అందులో శిక్షణ ఇప్పించాక, నిక్షిత్‌ ప్రతిభ చూసి ఆశ్యర్యపోయారు.

పసిడి పతకం.. సొంతం

దిల్లీలో జరిగే ఇన్నర్‌ స్పేస్‌ స్కేటింగ్‌ కోసం నిక్షిత్‌ను పంపాలనుకున్నారు. దానికై రెండేళ్లుగా సాధన చేయిస్తూ వచ్చారు. అలా నిక్షిత్‌ దిల్లీలో జరిగిన జాతీయ స్థాయి పోటీలో పాల్గొని నేషనల్‌ ఛాంపియన్‌గా నిలిచి, బంగారు పతకాన్ని సాధించాడు. అమ్మానాన్న, కోచ్‌ తనని ఎంతో ప్రోత్సహించారని,  ఒలింపిక్స్‌లో దేశానికి పతకం తేవడమే లక్ష్యమంటున్నాడీ నేస్తం. నిక్షిత్‌ పట్టుదలను చూసి అందరూ అభినందిస్తున్నారు. మరి మీరూ నిక్షిత్‌ను అభినందిస్తూ ఆల్‌ ద బెస్ట్‌ చెప్పేయండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని