చక్రాల ఆటలో పతకాల వేట!
వయసు 13 ఏళ్లు. సాధించిన స్వర్ణపతకాలు 15. ఇప్పటి వరకు తన ఖాతాలో వేసుకున్న మొత్తం పతకాలు దాదాపు 40! ఈ మూడు ముక్కలు చాలదా...! ఆ చిచ్చర పిడుగు గొప్పతనమేంటో చెప్పడానికి..! ఇంతకూ ఎవరా చిరుత.. ఏమా.. ఘనత.. వివరంగా తెలుసుకుందామా!
హైదరాబాద్ వెస్ట్ మారేడుపల్లికి చెందిన జూహిత్, ఆరేళ్ల వయసులోనే రోలర్ స్కేటింగ్‌పై ఇష్టం పెంచుకున్నాడు. అతి తక్కువకాలంలో మెలకువలు నేర్చుకుని అద్భుత ప్రదర్శనతో అందరూ అబ్బురపడేలా చేస్తున్నాడు. ఇటీవల మొహాలీ వేదికగా జరిగిన 59వ ‘జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్’లో తన సత్తా చాటాడు. ఈ పోటీల్లో ఏకంగా... రెండు స్వర్ణాలు తన ఖాతాలో వేసుకున్నాడు.
టీవీకి అతుక్కుపోవద్దని...
జూహిత్ ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. అయితే తనకు ఆరేళ్ల వయసున్నప్పడు ఎక్కువగా టీవీకి అతుక్కుపోయేవాడు. ఎలాగైనా సరే జూహిత్ దృష్టి మరల్చాలని.. తల్లిదండ్రులు సునీల్‌కుమార్, సంధ్యారాణి భావించారు. ఓ స్కేటింగ్ అకాడమీలో చేర్పించారు. మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డా.. క్రమక్రమంగా స్కేటింగ్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. ఇలా రోజూ 5 నుంచి 6 గంటలపాటు సాధన చేసేవాడు. చాలా తక్కువ సమయంలోనే జాతీయస్థాయిలో పోటీపడే స్థాయికి ఎదిగాడు.
చదువుల్లోనూ...
‘స్కేటింగ్‌లో రాణిస్తున్నాను కదా..’ అని జూహిత్ విద్యను నిర్లక్ష్యం చేయడం లేదు. 95 శాతం మార్కులతో చదువుల్లోనూ దూసుకుపోతున్నాడు. తల్లిదండ్రులు, కోచ్‌లు, ఉపాధ్యాయుల సహకారంతో జాతీయ స్థాయిలో పతకాలు సాధించగలిగానని.. భవిష్యత్తులో ఆసియాతో పాటు అంతర్జాతీయ స్థాయిలోనూ సత్తా చాటడమే తన ధ్యేయం అంటున్నాడు జూహిత్. మరి మనమూ ఈ బుడతడికి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా!
- జ్యోతికిరణ్, ఈటీవీ హైదరాబాద్ బ్యూరో
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Suryakumar Yadav : ఇది ‘స్కై’ భిన్నమైన వెర్షన్ : తన ఇన్నింగ్స్‌పై సూర్య స్పందన ఇది..
-
Crime News
Kothagudem: వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి.. బాధితుల్లో 15 మంది మైనర్ బాలికలు?
-
Movies News
Rajinikanth: ‘వీర సింహారెడ్డి’ దర్శకుడికి రజనీకాంత్ ఫోన్ కాల్.. ఎందుకంటే?
-
Sports News
Djokovic: అవమానపడ్డ చోటే.. మళ్లీ విజేతగా..
-
World News
H1b Visa: మార్చి 1 నుంచి హెచ్1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ
-
Ap-top-news News
Tamilisai: బడ్జెట్‌కు ఇంకా ఆమోదం తెలపని గవర్నర్ తమిళిసై