సంకల్పమే ఆ చిన్నారి బలం!
చక్కగా చదువుకోండని బడికి పంపితే.. ‘ఊహూ.. వెళ్లం’ అంటూ మారాం చేస్తారు మనలో చాలామంది. కానీ కాళ్లూ చేతులూ సహకరించకపోయినా, నేను చదువుకుంటానంటూ పట్టుబట్టి పాఠాలు నేర్చుకుంది ఓ నేస్తం. తన వైకల్యాన్ని సవాలుగా తీసుకుని మరీ చదువుకుంటూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. మరి ఆ నేస్తం ఎవరో.. ఏం చదువుకుంటుందో తెలుసుకోవాలని ఉందా.. అయితే చదివేయండి.
ఆ నేస్తం పేరు జశోదా దలై. వయసు 13 ఏళ్లు. ఒడిశాలోని కొరాపుట్ జిల్లాలోని చారముల గ్రామం. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతోంది. అమ్మ నిల దలై, నాన్న మకర్ దలై.
పట్టుదలతో అడుగు..
జశోదాకు పుట్టుకతోనే వైకల్యం ఉంది. కాళ్లూ చేతులూ పనిచేయవు. తనకు మూడేళ్ల వయసప్పుడు కాళ్లతో రాయడం మొదలుపెట్టింది. అందుకు చాలానే కష్టపడింది. తనతోటి వారితో కలిసి చదువుకోవాలని, అందరిలానే స్కూలుకు వెళ్లాలని పట్టుబట్టింది. తన సంకల్పం చూసిన అమ్మానాన్న ప్రోత్సహించారు. ఇంటికి అర కిలోమీటరు దూరంలో ఉన్న పాఠశాలకు పంపించారు. మొదట అమ్మానాన్న తోడు వచ్చినా.. తర్వాత తనే ట్రైసైకిల్ మీద స్కూలుకు వెళ్లి రావడం అలవాటు చేసుకుంది.
ఆశ కోల్పోకూడదు..
జశోదా బడిలో జరిగే కార్యక్రమాల్లోనూ పాల్గొంటుంది. ఏ రోజూ స్కూలు మానదు. పట్టుదలతో చక్కగా చదువుకుంటుంది. హిందీ, ఇంగ్లిష్, ఒడియా మూడు భాషలు మాట్లాడుతుంది. అన్నట్టు ఎలాంటి పరిస్థితుల్లోనూ జశోద ఏడవడం తాము చూడలేదని తల్లిదండ్రులు అంటున్నారు. తన వైకల్యాన్ని చూసి అసలు బాధపడదని, పట్టుదలగా చదువుతుందని, ఉన్నత చదువులు చదివి మంచి పేరు తెచ్చుకుంటానంటోందని సంతోషంగా చెబుతున్నారు జశోదా అమ్మానాన్న. అంతేకాదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆశ కోల్పోకూడదని అమ్మానాన్న చెప్పారని, బాగా చదివి ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకుంటానని, వాళ్లకు చేయూత ఇస్తాననీ ధీమాగా చెబుతుందీ నేస్తం. నిజంగా జశోద గ్రేట్ కదూ! తను అనుకున్నది సాధించాలని కోరుకుంటూ ఈ చిన్నారికి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా మరి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Congress: చైనా విషయంలో కేంద్రానిది DDLJ వ్యూహం: కాంగ్రెస్ కౌంటర్
-
India News
Rahul Gandhi: మంచులో రాహుల్-ప్రియాంక ఫైట్.. వీడియో వైరల్
-
Movies News
Jayasudha: ఆ భయంతోనే అజిత్ సినిమాలో నటించలేదు: జయసుధ
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Chintakayala Vijay: సీఐడీ విచారణకు హాజరైన తెదేపా నేత చింతకాయల విజయ్
-
Movies News
Jamuna: అలనాటి నటి జమున బయోపిక్‌లో మిల్కీ బ్యూటీ..!