చెక్క కారు.. నాన్న చేసిచ్చారు!
హాయ్ ఫ్రెండ్స్! మనం బొమ్మనో, పుస్తకమో అడిగితే నాన్న బయటకు వెళ్లినప్పుడు తీసుకు వస్తుంటారు కదా! ఇప్పుడు మనం చెప్పుకోబోయే నాన్న మాత్రం తీసుకురావడం కాదు.. కొడుకు అడిగిన కారును తయారు చేసి మరీ ఇచ్చాడు. ఆ వివరాలు తెలుసుకుందాం..
వియత్నాంకు చెందిన వాన్ డెవో గూగుల్ ఉద్యోగి. ఖాళీ సమయంలో చెక్కలను వివిధ కళాకృతులుగా తీర్చిదిద్దుతుంటాడు. ఈయనకు నాలుగేళ్ల కొడుకున్నాడు. ఒకరోజు తండ్రీకొడుకులిద్దరూ నడుచుకుంటూ బయటకు వెళ్లారు. ఆ సమయంలో షిప్పులాంటి రోల్స్ రాయిస్ కారును చూసిన కొడుకు ‘నాన్నా.. నాన్నా.. నాకూ అలాంటిది కావాలి’ అని అడిగాడట.
68 రోజుల కష్టం
కోట్లు ఖర్చు చేసి రోల్స్ రాయిస్ కారును కొనే స్తోమత ఆ తండ్రికి లేదు. అలాగనీ, కొడుకు కోరిక తీర్చకుండా ఉండలేడు. అందుకే... చిన్న చిన్న వృథా చెక్క ముక్కలను తీసుకొని అచ్చంగా అలాంటి కారునే తయారు చేశాడా తండ్రి. అలా అని బొమ్మది అనుకునేరు! అందులో అమర్చిన మోటారు సాయంతో రయ్‌రయ్‌మంటూ రోడ్లపై దూసుకెళ్లొచ్చు. ముందు భాగంలో లైట్ల దగ్గరి నుంచి టైర్లు, సీట్లు ఇలా వెనుక బంపర్ వరకూ ప్రతిదీ నిజమైన కారులానే తయారు చేయడంతో ఆ కొడుకు ఆశ్చర్యంతో ఎగిరి గంతేశాడు. అది తయారు చేసేందుకు ఆయనకు 68 రోజులు పట్టిందట.
రెడీ కాగానే షికారు
ఎంతో కష్టపడి మరీ కొడుకు అడిగిన కారును సిద్ధం చేశాక... ఇంక ఆగుతారా ఎవరైనా! వెంటనే, తండ్రీకొడుకులిద్దరూ కలిసి ఎంచక్కా అందులో షికారుకు వెళ్లిపోయారు. కొంతదూరం ప్రయాణించాక... డిక్కీలోంచి టెంట్, కుర్చీలను బయటకు తీసి ఇద్దరూ హాయిగా కబుర్లు చెప్పుకొన్నారు. అంతేకాదు... వెనుక సీట్ల స్థానంలో ఏర్పాటు చేసిన షెల్ఫ్ నుంచి గ్లాసులు తీసి వాటిలో జ్యూస్ పోసుకొని ఎంజాయ్ చేశారా తండ్రీకొడుకులు.
లైకులే లైకులు
కొడుకు కోసం చేసిన కారును వాన్ డెవో యూట్యూబ్‌లోనూ సోషల్ మీడియాలోనూ పోస్టు చేయడంతో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. చూసిన వారంతా వావ్ అనేస్తున్నారు! లైకుల మీదు లైకులతో పాటు కామెంట్లూ వెల్లువెత్తుతున్నాయట. మొత్తానికి కారు భలే ఉంది కదూ!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Earthquake: ఈ దేశాల్లో నిత్యం భూప్రళయాలే
-
India News
Punjab: చేతులతో నాలుగు బుల్లెట్ బైక్‌లను ఆపిన యువకుడు
-
India News
Marriage: వరుడికి 65.. వధువుకు 23
-
World News
Earthquake: తుర్కియే భూకంపం.. ముందే హెచ్చరించిన పరిశోధకుడు..!
-
India News
Layoffs: ‘కాబోయేవాడికి ‘మైక్రోసాఫ్ట్’లో ఉద్యోగం పోయింది.. పెళ్లి చేసుకోమంటారా?’
-
Sports News
Ind vs Aus: టీమ్ ఇండియా 36కి ఆలౌట్.. ఆ పరాభవానికి బదులు తీర్చుకోవాల్సిందే!