పాడుతా తీయగా.. ముద్దు ముద్దుగా!

వయసు కేవలం అయిదేళ్లే.. అయితేనేం చక్కగా పాటలు పాడతాడు. అదీ ఒక్క భాషలో కాదు.. ఏకంగా అరడజను భాషల్లో! ఇంకేం ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. ఇంతకీ బుజ్జి బుడతడు ఎవరో తెలుసా?

Published : 06 Feb 2022 00:31 IST

వయసు కేవలం అయిదేళ్లే.. అయితేనేం చక్కగా పాటలు పాడతాడు. అదీ ఒక్క భాషలో కాదు.. ఏకంగా అరడజను భాషల్లో! ఇంకేం ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. ఇంతకీ బుజ్జి బుడతడు ఎవరో తెలుసా?

ధ్రిÅతిష్మన్‌ చక్రబర్తిది అసోంకు చెందిన నజీరా పట్టణంలోని ఓఎన్‌జీసీ కాలనీ. తనకు మూడేళ్లు ఉన్నప్పుడే ఓ రికార్డు సృష్టించాడు. అతిచిన్న వయసులోనే ఎక్కువ భాషల్లో పాడిన సింగర్‌గా ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. అస్సామీ, బెంగాలీ, ఇంగ్లిష్‌, హిందీ, మరాఠీ, కన్నడ, సంస్కృతం.. అంతే కాదండోయ్‌ శ్రీలంక అధికార భాషైన సింహళంలోనూ చక్కగా, రాగయుక్తంగా పాడగలడు.

పిట్టకొంచెం.. ప్రతిభ ఘనం!

ప్రస్తుతం అయిదేళ్ల వయసున్న ఈ బుడతడు.. ఏడెనిమిది భాషల్లో ఏకంగా 70 పాటలు పాడాడు. ఇందులో చాలా వరకు సోషల్‌ మీడియాలో వైరల్‌గానూ మారాయి. టీవీ షోలో కూడా పాల్గొన్నాడు. ఈ బుడతడు అస్సామీలో పాడిన ఓ పాటను అసోం ముఖ్యమంత్రి కూడా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ప్రధానమంత్రి కూడా ఈ బుజ్జి సింగర్‌ను ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు. గతనెలలో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలపురస్కారాన్ని ఈ బుడతడు సొంతం చేసుకున్నాడు. ఇంత చిన్న వయసులోనే ఈ బుడతడు ఇన్ని ఘనతలు సాధించాడంటే నిజంగా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని