చదివిస్తూ... పాఠాలు చెబుతూ...
హాయ్ నేస్తాలూ! అమ్మానాన్నలు ఎంతో కష్టపడి ఫీజులు కడుతూ మనల్ని చదివిస్తున్నారు కదా! కానీ, బయట ఎంతోమంది పిల్లలు డబ్బులు లేకనో కుటుంబ పరిస్థితుల వల్లనో చదువుకు దూరం అవుతున్నారు. చాలామంది మధ్యలోనే బడి మానేస్తున్నారు. అలాంటి చిన్నారులకు నేనున్నానంటూ ఓ అక్క భరోసానిస్తోంది. తనెవరో, ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి.
బెంగళూరుకు చెందిన ఆష్మితా గుప్తా ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతోంది. ఏడాది నుంచి ‘ప్రతి ఒక్కరికీ చదువు’ (ఈ4ఈ : ఎడ్యుకేషన్ ఫర్ ఎవ్రీవన్) అనే నినాదంపైన పనిచేస్తుంది. అందులో భాగంగా.. తన ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో పేదరికంతో చదువుకు దూరమైన వారినీ, వివిధ కారణాలతో మధ్యలోనే బడి మానేసిన వారినీ గుర్తించి పాఠశాలల్లో చేర్పిస్తుందన్నమాట.
ఆలోచన ఎలా వచ్చిందంటే..
గత ఏడాది సరిగ్గా తన వయసున్న సుమ అనే అమ్మాయి ఫీజు కట్టలేక బడి మానేసింది. సుమకు ఒక సోదరి కూడా ఉంది. తల్లిదండ్రులు క్యాన్సర్‌తో చనిపోవడంతో వారిద్దరూ అనాథలయ్యారు. అప్పటినుంచీ ఓ ట్రస్టులో ఆశ్రయం పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆష్మితా.. కొందరు దాతల సహాయంతో ఫీజు చెల్లించి సుమను బడిలో చేర్పించింది. అదే సమయంలో ఈ పరిస్థితి సుమ ఒక్కదానిదే కాదనీ, కొన్ని వందల మంది చిన్నతనంలోనే చదువుకు దూరం అవుతున్నారనీ తెలుసుకుంది. దాంతో వెనకబడిన చిన్నారులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు ఆర్థికంగానూ అండగా నిలవాలనుకుంది ఆష్మితా.
స్వయంగా క్లాసులు..
విద్యతోనే అభివృద్ధి సాధ్యమని బలంగా నమ్మిన ఆష్మితా... 1ఎం1బి (వన్ మిలియన్ ఫర్ వన్ బిలియన్) అనే యూకేకు చెందిన స్వచ్ఛంద సంస్థతో చేతులు కలిపింది. ఇప్పటివరకూ దాదాపు 300 మంది చిన్నారులకు భరోసా కల్పించింది. అంతేకాదు... ఏ దిక్కూ లేని వారికి నీడ కల్పించేలా అయిదు ఆశ్రమాల నిర్వాహకులనూ ఒప్పించింది. దాతలతోపాటు ఇంటింటికి తిరుగుతూ విరాళాలు సేకరించిందట. తీరిక సమయాల్లో దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తూ అక్కడి విద్యార్థులకు ల్యాప్‌టాప్ సహాయంతో సాంకేతిక పాఠాలూ చెబుతోంది ఈ అక్క.
టూల్ తయారు చేసి..
కొందరు విద్యార్థులకు ప్రతిభ ఉన్నా... కమ్యూనికేషన్ స్కిల్స్ లేవని ఆష్మితా గుర్తించింది. వారికోసం ‘ఎడ్యుఫికేషన్’ పేరిట ఓ టూల్‌కిట్‌ను రూపొందించింది. పోటీపరీక్షలకు ఉపయోగకరంగా ‘ఎన్సీఈఆర్టీ’ ప్రచురించే పుస్తకాలన్నింటినీ అక్కడ అందుబాటులో ఉంచింది. సొంతంగా తాను తయారు చేసిన మెటీరియల్‌ను కూడా అక్కడే చదివేలా చేసింది. ఇంటర్నెట్ అవసరం లేకుండా పనిచేసే ఈ టూల్‌కిట్‌ను మరింత మందికి ఉపయోగపడేలా ప్రస్తుతం తీర్చిదిద్దుతోంది ఆష్మితా. బడికెళ్లే వయసులోనే ఇంత మంచి పని చేస్తున్న ఈ అక్క నిజంగానే గ్రేట్ కదూ! .
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Turkey- syria Earthquake: అద్భుతం.. మృత్యుంజయులుగా బయటకొచ్చిన చిన్నారులు
-
India News
Cheetah: అవి పెద్దయ్యాక మనల్ని తినేస్తాయి.. మన పార్టీ ఓట్లను తగ్గించేస్తాయి..
-
Sports News
IND vs AUS: మూడో స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ని ఎంపిక చేయండి: రవిశాస్త్రి
-
Movies News
Kiara Sidharth Malhotra: ఒక్కటైన ప్రేమజంట.. ఘనంగా కియారా- సిద్ధార్థ్‌ల పరిణయం
-
Politics News
BJP: ప్రధాని మోదీపై రాహుల్ ఆరోపణలు నిరాధారం, సిగ్గుచేటు: రవిశంకర్ ప్రసాద్
-
World News
Turkey Earthquake: భూకంప విలయం.. రంగంలోకి శాటిలైట్లు!