వ్యర్థాలతో వారెవ్వా!
ఎనిమిదో తరగతి చదువుతున్న అబ్బాయి.. అద్భుతమే చేశాడు. పనికిరాని వాహన వ్యర్థాలతో ఓ బుజ్జి కారునే తయారు చేశాడు. పైగా అది బ్యాటరీతో పరుగులు తీస్తుంది. పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన వయసులోనే పనిముట్లు చేతపట్టి కారునే తయారు చేయడమంటే మాటలు కాదు కదా..! మరి ఆ వివరాలేంటో క్లుప్తంగా తెలుసుకుందామా!
ముంబయికి చెందిన అర్జున్‌కు ప్రయోగాలంటే ఇష్టం. దానికి ఇంట్లోవారి సహకారమూ తోడైంది. ఇంకేం తన ఆవిష్కరణలతో దూసుకుపోతున్నాడు. సన్నీ మోపెడ్ ఇంజిన్, మారుతి కారు స్టీరింగ్, స్కూటీ చక్రాలతో తన కలను సాకారం చేసుకున్నాడు.
రెండు సార్లు విఫలమై...
మొదటి ప్రయత్నంలోనే మన అర్జున్ను విజయం పలకరించలేదు. తుక్కు దుకాణాల నుంచి సేకరించిన మోపెడ్ ఇంజిన్, స్టీరింగ్, చక్రాలు, ఇనుప కమ్మీలతో ముందు ఓ రూపం తీసుకువచ్చాడు. నిజానికి మొదట సైకిల్ చక్రాలను వాడాడు. ఫలితం లేకుండా పోయింది. అయినా పట్టువదలకుండా ఈసారి స్కూటీ చక్రాలను నమ్ముకున్నాడు. కారు ముందుకు కదిలింది.
అంతలోనే... మొదటికి!
రెండోసారి.. కాస్త సఫలం అయింది అనుకునేంతలోనే, దశాబ్దాల కాలం నాటి సన్నీ మోపెడ్ ఇంజిన్ ‘నేనిక ముందుకు కదలలేను మొర్రో’ అని మొరాయించింది. తన కష్టమంతా వృథా అయినందుకు, ఈసారి అర్జున్ కాస్త నిరాశకు గురయ్యాడు.
ఆఖరుకు అదరగొట్టేశాడు..
స్కూల్ ఎగ్జిబిషన్ కోసం తన బుజ్జి కారు ప్రాజెక్టును అర్జున్ మళ్లీ ప్రారంభించాడు. మొరాయించిన ఇంజిన్‌ను మూలకు పడేసి 12 వాట్ల బ్యాటరీ, 48 వాట్ల మోటార్‌ను సేకరించాడు. వీటిని అమర్చి తన కారును పర్యావరణహిత వాహనంగా మార్చాడు.
వాళ్ల సహకారంతోనే...
‘ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ కారు దాదాపు 15 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మరింత శక్తిమంతమైన బ్యాటరీలు వాడితే ఇంకా ఎక్కువదూరం వెళుతుంది. నాకు ఈ ప్రాజెక్టులో అమ్మానాన్న, స్కూలు టీచర్లు చాలా సాయం చేశారు. వాళ్ల సహకారంతోనే నేను ఇది సాధించగలిగాను’ అని మన అర్జున్ ఆనందంగా చెబుతున్నాడు. ఎంతైనా ఈ బుడతడు నిజంగా గ్రేట్ కదూ!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Earthquake: ఈ దేశాల్లో నిత్యం భూప్రళయాలే
-
India News
Punjab: చేతులతో నాలుగు బుల్లెట్ బైక్‌లను ఆపిన యువకుడు
-
India News
Marriage: వరుడికి 65.. వధువుకు 23
-
World News
Earthquake: తుర్కియే భూకంపం.. ముందే హెచ్చరించిన పరిశోధకుడు..!
-
India News
Layoffs: ‘కాబోయేవాడికి ‘మైక్రోసాఫ్ట్’లో ఉద్యోగం పోయింది.. పెళ్లి చేసుకోమంటారా?’
-
Sports News
Ind vs Aus: టీమ్ ఇండియా 36కి ఆలౌట్.. ఆ పరాభవానికి బదులు తీర్చుకోవాల్సిందే!