రోజ్.. రోజ్.. నల్ల రోజా పువ్వు!
మనలాంటి పిల్లల నవ్వుల్ని రోజా పువ్వులతో పోల్చుతారు. అంతెందుకు పిల్లల్ని అమితంగా ఇష్టపడే చాచా నెహ్రూ కూడా తన కోటుకు రోజా పువ్వును ధరించేవారు. ఇప్పుడిదంతా ఎందుకంటే... మనం ఎంతో ఇష్టపడే రోజాలో.. ఓ కొత్తదాని గురించి తెలుసుకోబోతున్నాం కాబట్టి...!
గులాబీల్లో తెలుపు, ఎరుపు, పసుపు, నారింజ, నీలం ఇలా చాలా రంగులే ఉంటాయి. నలుపు రంగువీ ఉంటాయి. కానీ అవి నిజానికి నలుపు కాదు. ముదురు ఎరుపు. అచ్చంగా నలుపు రంగువి మాత్రం కేవలం ఒకే గ్రామంలో పూస్తాయి. కానీ ఆ గ్రామం మన దేశంలో లేదు. మరి ఎక్కడుందంటే...!
హ్యాట్సాఫ్ హఫేటీ..
టర్కీలోని హఫేటీ అనే గ్రామం ఈ నల్ల రోజాలకు ప్రసిద్ధి. ఈ గులాబీలకు ఈ రంగు, ప్రత్యేక సువాసన రావడానికి కారణం అక్కడి నేలలే అట. వసంతకాలం చివరిలో, వేసవికాలం ప్రారంభంలో వేలాదిగా పూసే ఈ నల్ల గులాబీలను కళ్లారా చూడటానికి వేలాదిగా జనం తరలి వస్తారు.
సువాసనలు వెదజల్లేలా..
ఈ గులాబీలకు కేవలం రంగే కాదు.. మరో ప్రత్యేక లక్షణం కూడా ఉంది. ఇవి మిగతా రోజాలతో పోల్చుకుంటే కాస్త ఎక్కువ సువాసనలు వెదజల్లుతాయట! అందుకే ఈ గులాబీలను జాగ్రత్తగా కత్తిరించి, వేలాడదీసి ఆరబెడతారు. తర్వాత వీటిని టీ, పర్ఫ్యూమ్‌ల తయారీలో వాడతారు.
ఆ ప్రాంతం స్వర్గం
ఈ నల్లగులాబీ వంగడం మొదట నలుపు రంగులో వికసిస్తుంది. తర్వాత ముదురు ఎరుపురంగులోకి మారుతుంది. కానీ హఫేటీలో మాత్రం నలుపురంగులోనే ఉంటుంది. దీనికి ఇక్కడి వాతావరణం, నేల, యూఫ్రటీస్ నది నీరే కారణమని స్థానికులు చెబుతుంటారు. అందుకే హఫేటీని నల్లగులాబీల స్వర్గం అని పిలుస్తారు. మరే ప్రాంతంలో వీటిని సాగు చేసినా... ఇక్కడ వచ్చిన నలుపు రంగు రాదు. ఫ్రెండ్స్.. మొత్తానికి ఇవీ నల్లగులాబీ విశేషాలు. భలే ఉన్నాయి కదూ... మీకు నచ్చాయి కదా!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs AUS: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ.. గెలిచేది ఆ జట్టే: మహేల జయవర్దనే
-
General News
Amaravati: రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ
-
India News
Delhi Mayor: దిల్లీ మేయర్ ఎన్నిక.. ముచ్చటగా మూడోసారి విఫలం..!
-
Movies News
Balakrishna: నా మాటలను వక్రీకరించారు.. నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ
-
World News
Earthquake: భూకంప విలయం.. మరుభూమిని తలపిస్తున్న తుర్కియే, సిరియా నగరాలు
-
Movies News
Tollywood: మాస్ లుక్లో కనిపించి.. ఆశ్చర్యానికి గురిచేసి!