పిచ్చుకల సేవలో బుడతలు!

పిచ్చుకల కిలకిలలు కలగా మారకుండా... అవి మన మధ్య హాయిగా బతికేందుకు ఓ ప్రొఫెసర్‌ కృషి చేస్తున్నారు..  ఆయనకు మనలాంటి చిన్నారులు బుడతాభక్తిగా సాయం చేస్తున్నారు... ఆ సంగతులేంటో మరింత వివరంగా తెలుసుకుందామా ఫ్రెండ్స్‌!

Updated : 23 Mar 2022 00:32 IST

పిచ్చుకల కిలకిలలు కలగా మారకుండా... అవి మన మధ్య హాయిగా బతికేందుకు ఓ ప్రొఫెసర్‌ కృషి చేస్తున్నారు..  ఆయనకు మనలాంటి చిన్నారులు బుడతాభక్తిగా సాయం చేస్తున్నారు... ఆ సంగతులేంటో మరింత వివరంగా తెలుసుకుందామా ఫ్రెండ్స్‌!

చెన్నైలో ఓ విద్యాసంస్థలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డి.గణేశన్‌ కొన్ని సంవత్సరాలుగా పిచ్చుకల సంరక్షణకు కృషి చేస్తున్నారు. ఆయనకు చిన్నారి విద్యార్థులు తమ చిట్టి చేతులతో సాయం చేస్తున్నారు. ఆయన పెద్ద సంఖ్యలో పిచ్చుకల కోసం గూళ్లను తయారు చేస్తున్నారు. వాటిని పాఠశాల విద్యార్థులు.. పిచ్చుకలు ఉపయోగించుకునేలా పలు చోట్ల అమరుస్తున్నారు. ఇలా తొండియార్పేట్‌లో రెండు పక్షిసంరక్షణ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. మూడో పక్షిసంరక్షణ కేంద్రం ఏర్పాటుకు తిరువొట్టియూర్‌లో అడుగులు పడ్డాయి.

అయిదు పాఠశాలల తోడ్పాటు...

ఈ గొప్పకార్యంలో గణేశన్‌కు అయిదు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాయం చేస్తున్నారు. కలప, కార్డ్‌బోర్డ్‌తో పిచ్చుకల కోసం ప్రొఫెసర్‌, వాలంటీర్లు దాదాపు 300 గూళ్లు తయారు చేస్తున్నారు. వీటిని విద్యార్థులు పలు చోట్ల పక్షులకు అందుబాటులో పెట్టనున్నారు. కేవలం అంతటితో వదిలేయక, పక్షులను నిత్యం గమనిస్తున్నారు. ఏకంగా వాట్సప్‌ గ్రూపే ఏర్పాటు చేసి అందులో ఎప్పటికప్పుడు పిచ్చుకల ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్‌ చేస్తున్నారు.

మూడేళ్లుగా మార్పు

గణేశన్‌ ‘కొడుగల్‌’ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి 2014 నుంచి పిచ్చుకల సంరక్షణకు కృషి చేస్తున్నారు. మూడేళ్లుగా పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. క్రమంగా పిచ్చుకల సంతతి పెరుగుతోంది. దీనంతటికీ పాఠశాల విద్యార్థుల సహకారమే కారణం అని ఆనందంగా చెబుతున్నారు. వాళ్లకు అభినందనలు కూడా చెబుతున్నారు. నిజంగా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని