Updated : 23 Mar 2022 00:30 IST

సముద్రాన్నే ఈదేసింది!

భారత నేవీకి చెందిన ఓ సీనియర్‌ అధికారి కూతురు జియారాయ్‌ (13) అరుదైన ఘనత సాధించింది. ముంబయిలోని నేవీ చిన్నారుల పాఠశాలలో చదువుతున్న ఈ బాలిక ఆదివారం శ్రీలంకలోని తలైమన్నార్‌ నుంచి పాక్‌జలసంధి గుండా సముద్రంలో ఈదుతూ భారత్‌లోని ధనుష్కోటికి చేరుకుంది. 29 కిలోమీటర్ల దూరాన్ని ఆమె 13 గంటల 10 నిమిషాల్లో చేరుకుంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పాక్‌జలసంధిని ఈదిన బాలికగా రికార్డు సృష్టించింది. నిజానికి జియా ఆటిజంతో బాధ పడుతోంది. తన లోపాన్ని సైతం జయించి ఈ బాలిక అలవోకగా సముద్రాన్ని ఈదింది. 2021 ఫిబ్రవరిలో వర్లీ సీ లింక్‌ నుంచి గేట్‌వే ఆఫ్‌ ఇండియా వరకు 36 కిలోమీటర్లు ఈది రికార్డు సృష్టించింది. 2020లో ‘నేషనల్‌ పారా స్విమ్మింగ్‌ ఛాంపియన్‌ షిప్‌’లో మూడు బంగారు పతకాలు, ‘నేషనల్‌ అండ్‌ స్టేట్‌ స్విమ్మింగ్‌, ఓపెన్‌ వాటర్‌ స్విమ్మింగ్‌ ఛాంపియన్‌ షిప్‌’లో పలు బంగారు పతకాలు, ఒక రజత పతకమూ గెలుచుకుని సత్తా చాటింది. ఇటీవల ప్రకటించిన ‘ప్రధాన్‌ మంత్రి రాష్ట్రీయ బాల్‌ పురస్కార్‌’నూ కైవసం చేసుకుంది. ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ జియా పేరు నమోదైంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని