పండు పండు.. చాక్లెట్ పండు!
‘పండేంటి?... చాక్లెట్ ఏంటి?’ అని తెగ ఆలోచిస్తున్నారు కదూ ఫ్రెండ్స్. అవును.. పండే చాక్లెట్ ఫ్లేవర్‌లో ఉంటుంది. ‘హుర్రే.. భలే.. భలే.. చాక్లెట్లు తింటే ఇంట్లో అమ్మానాన్నలు తిడతారు. ఇప్పుడిక ఎంచక్కా ఈ పండు తినేయొచ్చు’ అనుకుంటున్నారేమో. ప్చ్...! మనకు ఆ అదృష్టం లేదు. ఎందుకంటే ఈ పండు మన దగ్గర దొరకదు. ‘మరి ఎక్కడ దొరుకుతుంది? ఇంతకీ ఈ పండేంటి? దీని పేరేంటి?’ అని ఇలా బోలెడన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు కదూ! ఈ కథనం చదవండి చాలు. మీ అనుమానాలన్నీ ‘హుష్.. కాకి’ అయిపోతాయ్!
ఈ తియ్యటి పండు పేరు.. డయాస్ పిరాస్ నిగ్రా.. పలకడానికి ఇబ్బందిగా ఉంది కదూ! దీన్నే బ్లాక్ సపోట్, బ్లాక్ సోప్ఆపిల్, చాక్లెట్ పుడ్డింగ్ ఫ్రూట్ అనీ పిలుస్తారు. ఈ పండ్ల చెట్లు ఎక్కువగా మధ్య అమెరికా, మెక్సికో, కొలంబియాలో కనిపిస్తాయి.
నిత్యం పచ్చగా...
ఈ చెట్లు దాదాపు 25 మీటర్ల వరకు పొడవు పెరుగుతాయి. ఇవి ఎప్పుడూ చెట్టు నిండా ఆకులతో పచ్చగా కళకళలాడుతుంటాయి. ఈ మొక్కలు నాటిన మూడు నుంచి నాలుగు సంవత్సరాల తర్వాత కాయలు కాస్తాయి.
టొమాటో ఆకారంలో..
ఈ బ్లాక్ సపోట్ పండు చూడటానికి టొమాటో కాయ ఆకారంలో ఉంటుంది. ఒక్కో కాయ 5 నుంచి 10 సెంటీమీటర్ల పరిమాణం వరకు పెరుగుతుంది. ఈ కాయ ముందు ఆకుపచ్చ రంగులో ఉండి.. పండినప్పుడు ముదురు రంగులోకి మారుతుంది. కాయగా ఉన్నప్పుడు లోపలి గుజ్జు తెల్లగా ఉంటుంది. పక్వానికి వచ్చాక డార్క్ చాక్లెట్ రంగులోకి మారుతుంది.
డజను విత్తనాలు..
ఈ చాక్లెట్ పండులో 12 విత్తనాలుంటాయి. వీటిల్లో కొన్ని విత్తనాలు లేని రకాలూ ఉన్నాయి. ఈ పండ్లు పక్వానికి వచ్చాక ఎంత తియ్యగా ఉంటాయో.. పండకముందు అంత చేదుగా ఉంటాయి. ఈ చెట్టు మొదట చాలా నెమ్మదిగా పెరుగుతుంది. ఓ నాలుగైదు సంవత్సరాల తర్వాత కాస్త వేగంగా పెరుగుతుంది.
ఎన్నెన్నో లాభాలు!
ఈ చాక్లెట్ ఫ్రూట్‌ను ఆహారంగా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలుంటాయట. క్యాన్సర్, గుండెజబ్బులు, పక్షవాతం రాకుండా కాపాడుతుందట. ఇందులో దాదాపు ఆరెంజ్‌లో ఉన్నంత పరిమాణంలో విటమిన్- సి దొరుకుతుంది. ఫైబర్, పొటాషియం కూడా సమృద్ధిగా లభిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. కంటి చూపును కూడా మెరుగు పరుస్తుందట. అంతెందుకు ఇమ్యూనిటీని పెంచుతుందట. ఈ కరోనా కాలంలో వ్యాధినిరోధక శక్తి చాలా అవసరం కదూ! మొత్తానికి ఇవీ ఫ్రెండ్స్ చాక్లెట్ పండు విశేషాలు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Jayasudha: ఆ భయంతోనే అజిత్ సినిమాలో నటించలేదు: జయసుధ
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Chintakayala Vijay: సీఐడీ విచారణకు హాజరైన తెదేపా నేత చింతకాయల విజయ్
-
Movies News
Jamuna: అలనాటి నటి జమున బయోపిక్‌లో మిల్కీ బ్యూటీ..!
-
General News
TS High Court: గవర్నర్ విధుల్లో న్యాయ సమీక్ష చేయొచ్చా?: హైకోర్టు వ్యాఖ్య
-
Movies News
Kailash Kher: సింగర్ కైలాశ్ ఖేర్‌పై వాటర్ బాటిళ్లతో దాడి..