కేకు తయారీలో.. కేక
హాయ్ ఫ్రెండ్స్.. స్నేహితులో బంధువులో పుట్టినరోజుకు పిలిస్తే ఎప్పుడెప్పుడు వెళ్దామా.. ఎప్పుడెప్పుడు కేకు తిందామా.. అని ఎదురుచూస్తుంటాం కదా! తినడమంటే బోలెడు ఇష్టం కానీ కేకు చేయమంటే మాత్రం తెల్లమొహం వేసేస్తాం. అయితే, ఓ నేస్తం మాత్రం అచ్చం ప్రొఫెషనల్‌లా కేకులను తయారు చేసేస్తోంది మరి.. ఆ వివరాలే ఇవీ..
ఎల్లీది కెనడా దేశంలోని టొరంటో నగరం. తనకిప్పుడు నాలుగేళ్లు. ఈ వయసులో ఎవరైనా బుడిబుడి అడుగులూ.. చిట్టిపొట్టి మాటలతో సందడి చేస్తుంటారు. కానీ, ఎల్లీ మాత్రం ఎంతో చక్కగా ఏకంగా డిజైనర్ కేకులనే తయారు చేస్తోంది. నిజమేనండీ.. సాధన ఉంటే తప్ప పెద్దవాళ్లకూ సాధ్యం కాని రకరకాల ఆకృతులనూ ఈ చిన్నారి ఎంతో అలవోకగా తీర్చిదిద్దుతోంది.
సోషల్ మీడియాలో ఫాలోయింగ్
తల్లిదండ్రులను చూసే పిల్లలూ నేర్చుకుంటారని అంటుంటారు కదా ఫ్రెండ్స్. ఎల్లీ కూడా వాళ్ల అమ్మను చూసే రెండేళ్ల వయసు నుంచే కేకుల తయారీ నేర్చుకుందట. చిన్నతనంలోనే తన సూపర్ క్రియేటివిటీ ఉపయోగించి చేసిన కేకులకూ, వాటి తయారీ వీడియోలకూ సోషల్ మీడియాలో చాలామంది అభిమానులూ ఉన్నారండోయ్. ఇన్‌స్టాలో ‘ది కేకింగ్ గర్ల్’ పేరిట ప్రత్యేక ఖాతాలో ప్రతి వీడియోనూ పంచుకుంటోంది. టాపింగ్‌కు అవసరమైన సామగ్రితోపాటు కటింగ్ కూడా సొంతంగానే చేసుకుంటోంది. అంతేకాదు.. మీరు ఏదైనా ఫొటో తీసుకెళ్లి, అలాంటి కేకు కావాలంటే నిమిషాల వ్యవధిలోనే చేసి ఇచ్చేస్తుందట.
నాన్నకు ప్రేమతో..
ఇటీవల ఎల్లీ వాళ్ల నాన్న పుట్టినరోజుకు తానే స్వయంగా ఓ ప్రత్యేక కేకును తయారు చేసింది. కేండీలు, స్ప్రింకర్ల సహాయంతో కేవలం గంటన్నరలోనే రెడీ చేసిన ఈ కేకుకు ‘వ్యాక్యూమ్ టాపర్’ అని పేరూ పెట్టిందట. ఈ వీడియోను ఎల్లీ వాళ్ల అమ్మ ఇటీవల సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. నెటిజన్లంతా ‘యూ.. ఆర్ సో టాలెంటెడ్’ అని చిన్నారిని తెగ పొగిడేస్తున్నారు. ఈ కేకులను చూస్తుంటేనే మీకు నోరూరుతోంది కదూ!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyd ORR: డివైడర్‌ను దాటి ఢీకొట్టిన కారు.. ఇద్దరి మృతి, 8 మందికి తీవ్రగాయాలు
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Sundeep Kishan: రిలేషన్షిప్ నాకు సెట్ కాదు.. బ్రేకప్ దెబ్బ గట్టిగా తగిలింది: సందీప్ కిషన్
-
World News
Pervez Musharraf: ‘కార్గిల్’ కుట్ర పన్ని.. పదవి కోసం నియంతగా మారి..!
-
General News
Tirumala: నూతన పరకామణిలో శ్రీవారి హుండీ కానుకల లెక్కింపు.. భక్తులు చూసేలా ఏర్పాట్లు
-
World News
Musharraf: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కన్నుమూత!