చిన్న వయసు.. పెద్ద మనసు!
హాయ్ ఫ్రెండ్స్.. ఒకటీ రెండుసార్లు చదివాక కథలూ, బొమ్మల పుస్తకాలను అటకెక్కించేస్తాం. ఆడుకోవాలనే ఇష్టం తీరాకనో, బ్యాటరీలు అయిపోయాకనో చాలావరకు బొమ్మలనూ పడేస్తుంటాం. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే నేస్తం మాత్రం చదివేసిన పుస్తకాలతోపాటు పక్కన పెట్టేసిన బొమ్మలనూ వేరే పిల్లలకు ఇచ్చేస్తున్నాడు. ఇంతకీ అతడి వివరాలేంటో తెలుసుకుందాం రండి.
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుకు చెందిన రొమిల్కు ప్రస్తుతం ఏడేళ్లు. ఇంత చిన్న వయసులోనే ఇటీవల దాదాపు 90 కిలోల పుస్తకాలతోపాటు కొన్ని బొమ్మలనూ నిరుపేద చిన్నారులకు ఉచితంగా అందించాడు.
ఏడాది వయసు నుంచే..
ఏడాది వయసు నుంచే పుస్తకాల్లోని రంగురంగుల బొమ్మలు చూస్తూ ఈ నేస్తం కాలక్షేపం చేసేవాడట. కొడుకు ఆసక్తిని గమనించిన తల్లి, రెండో ఏడాది నుంచే పుస్తకాల్లోని కథలను చదివి వివరించడం, వివిధ శబ్దాలు వినిపించడం, ఏబీసీడీలూ చెప్పడం ప్రారంభించింది. అలా క్రమక్రమంగా బొమ్మలూ, స్నేహితులతో ఆడుకోవడం కంటే పుస్తకాలు చదివేందుకే రొమిల్ ఆసక్తి చూపేవాడు.
ఇంట్లోనే మినీ లైబ్రరీ..
కుమారుడి ఇష్టాన్ని గమనించిన తల్లిదండ్రులు పుస్తకాలనే ఎక్కువగా తీసుకొచ్చేవారు. అలా కొనుగోలు చేసిన వాటితో ఇంట్లో ఏకంగా మినీ లైబ్రరీనే ఏర్పాటు చేశారట. ఒకరోజు రొమిల్ స్నేహితులతో కలిసి ఆడుకుంటుంటే.. పక్కనున్న బస్తీలోంచి ఓ బాబు వచ్చి, తన చేతిలోని బొమ్మను అడిగాడట. క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఇచ్చేశాడట. అప్పుడే రొమిల్ మనసులో ఓ ఆలోచన వచ్చిందట.
చదివినవన్నీ ఇచ్చేయాలనీ..
చిన్నప్పటి నుంచి తాను చదివేసిన పుస్తకాలన్నీ అల్మారాల్లో పడి ఉండటాన్ని రొమిల్ గమనించాడు. వాటిని అలా ఉంచేయడం కంటే, చదవాలనే ఆసక్తి ఉండీ.. కొనుక్కునే స్తోమత లేని పిల్లలకు ఉచితంగా ఇవ్వాలని అనుకున్నాడు. తన ఆలోచనను తల్లిదండ్రులకు చెప్పడంతో, వారు కుమారుడిని అభినందించడంతోపాటు వెంటనే సరేనన్నారు.
స్వచ్ఛంద సంస్థలకు..
ఇటీవల ఇంట్లో ఉన్న దాదాపు 90 కేజీల బరువైన పుస్తకాలను మూడుగా విభజించి.. స్థానికంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలతోపాటు ప్రభుత్వ బడుల్లో చదివే చిన్నారులకు అందించారు. పజిళ్లు, ట్రైన్లు, కార్లు తదితర బొమ్మలనూ అట్టపెట్టెల్లో సర్ది.. అక్కడే ఉన్న ఓ ప్లేస్కూల్లోని పిల్లలకు పంపిణీ చేశారు. చిన్న వయసులోనే ఇంత మంచి మనసున్న ఈ నేస్తం నిజంగా గ్రేట్ కదూ!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyd ORR: డివైడర్ను దాటి ఢీకొట్టిన కారు.. ఇద్దరి మృతి, 8 మందికి తీవ్రగాయాలు
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Movies News
Sundeep Kishan: రిలేషన్షిప్ నాకు సెట్ కాదు.. బ్రేకప్ దెబ్బ గట్టిగా తగిలింది: సందీప్ కిషన్
-
World News
Pervez Musharraf: ‘కార్గిల్’ కుట్ర పన్ని.. పదవి కోసం నియంతగా మారి..!
-
General News
Tirumala: నూతన పరకామణిలో శ్రీవారి హుండీ కానుకల లెక్కింపు.. భక్తులు చూసేలా ఏర్పాట్లు
-
World News
Musharraf: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కన్నుమూత!