స్టార్ట్.. కెమెరా.. యాక్షన్!
తనో పదో తరగతి విద్యార్థిని.. కేవలం సిలబస్, పుస్తకాలకే పరిమితం కాలేదు... ఏకంగా ఓ సినిమాకు దర్శకురాలిగా పనిచేస్తోంది. ఆ విద్యార్థిని ఎవరో, ఆ వివరాలేంటో తెలుసుకుందామా! అయితే ఈ కథనం చదివేయండి.
కేరళకు చెందిన చిన్మయి నాయర్ ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. ఇటీవలే పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తోంది. ఈ ఖాళీ సమయంలో ఆమె ఒక పూర్తి స్థాయి ఫ్యామిలీ థ్రిల్లర్ సినిమాకు దర్శకురాలిగా పనిచేస్తోంది. ఈ చిత్రంలో విజయ్ యేసుదాస్ అనే గాయకుడు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో శ్వేత మేనన్ కూడా నటిస్తున్నారు. కొట్టాయం జిల్లా కలెక్టర్ జయశ్రీ కూడా ఈ సినిమాలో కలెక్టర్ పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె విద్యార్థుల్లో స్ఫూర్తినింపే సందేశం ఇచ్చారట.
ముగ్గురు స్నేహితుల కథ..
ఈ సినిమా ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరుగుతుందట. తన పాఠశాల జీవితం స్ఫూర్తితో ఈ సినిమా కథ సిద్ధం చేసుకున్నట్లు చిన్మయి చెబుతోంది. స్క్రిప్ట్‌ను డెవలప్ చేయడంలో వాళ్ల నాన్న సహకారం తీసుకుందట. ఆయన కూడా గతంలో కొన్ని సినిమాలకు డైరెక్టర్‌గా పనిచేశారు. మొత్తానికి సినిమా చిత్రీకరణ 35 రోజుల్లో పూర్తి చేసేలా షెడ్యూల్ రూపొందించారట. ఈ చిత్రానికి మలేషియాకు చెందిన ఓ వ్యాపార వేత్త నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
లఘు చిత్రాలతో మొదలు...
చిన్మయి నాయర్ రెండు సంవత్సరాల ముందు నుంచే కొన్ని లఘు చిత్రాలు తీస్తోంది. ‘చెంబిలా తుల్లి’, ‘గ్రాండ్ మా’ అనే రెండు షార్ట్ ఫిల్మ్స్‌కు తను దర్శకత్వం వహించింది. ‘గ్రాండ్ మా’ లఘు చిత్రానికైతే అప్పట్లో మంచి పేరు వచ్చింది. చిన్మయి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మనసారా కోరుకుందామా. ఇంకెందుకాలస్యం మరి... ఆల్ ది బెస్ట్ చెప్పేయండి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
చనిపోయాడనుకొని ఖననం చేశారు.. కానీ స్నేహితుడికి వీడియో కాల్!
-
Ap-top-news News
Andhra News: పన్నులు వసూలు చేసే వరకూ సెలవుల్లేవ్
-
India News
JEE Main: జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
World News
Earthquake: ఈ దేశాల్లో నిత్యం భూప్రళయాలే
-
India News
Punjab: చేతులతో నాలుగు బుల్లెట్ బైక్‌లను ఆపిన యువకుడు
-
India News
Marriage: వరుడికి 65.. వధువుకు 23