5 రోజులు.. 200 కిలోమీటర్లు..!

అనగనగా ఓ చిన్నారి. వయసేమో పదేళ్లు. చదువుతోంది నాలుగో తరగతి. రెండు వందల కిలోమీటర్ల దూరాన్ని అయిదు రోజుల్లో పరిగెత్తింది. ఇంతకీ ఆ చిరుత ఎవరు? ఎందుకిలా చేసిందో తెలుసుకోవాలని ఉందా.. అయితే ఇంకెందుకాలస్యం ఈ కథనం చదివేయండి. 

Updated : 26 May 2022 00:30 IST

అనగనగా ఓ చిన్నారి. వయసేమో పదేళ్లు. చదువుతోంది నాలుగో తరగతి. రెండు వందల కిలోమీటర్ల దూరాన్ని అయిదు రోజుల్లో పరిగెత్తింది. ఇంతకీ ఆ చిరుత ఎవరు? ఎందుకిలా చేసిందో తెలుసుకోవాలని ఉందా.. అయితే ఇంకెందుకాలస్యం ఈ కథనం చదివేయండి. 

త్తరప్రదేశ్‌కు చెందిన కాజల్‌ గతనెల 10వ తేదీన ప్రయాగ్‌రాజ్‌ నుంచి తన పరుగు ప్రారంభించింది. 15వ తేదీ నాటికి 200 కి.మీ. పరిగెత్తి లక్నోలో ముఖ్యమంత్రి యోగిఆదిత్యనాథ్‌ను కలిసింది. ఈ చిన్నారి అంతకంటే కొన్ని రోజుల ముందే ముఖ్యమంత్రికి ఓ లేఖ రాసింది. అందులో ఆయన్ను కలవనున్నట్లు పేర్కొంది.

ఇంతకీ ఎందుకంటే...
గత ఏడాది జరిగిన ఓ మారథాన్‌లో కాజల్‌ పాల్గొంది. కానీ తనకు జిల్లా అధికారుల నుంచి కానీ, తాను చదువుతున్న పాఠశాల నుంచి కానీ ప్రశంసలు అందలేదు. దీంతో మన కాజల్‌ చిన్నబుచ్చుకుంది. అందుకే ఏకంగా ముఖ్యమంత్రినే కలవాలనుకుంది.

సీఎం సైతం..
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సైతం చిన్నారిని సాదరంగా స్వాగతించారు. 200 కిలోమీటర్లు పరిగెత్తుతూ వచ్చిన విషయాన్ని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. తాను భవిష్యత్తులో అథ్లెట్‌ కావాలనుకుంటున్నట్లు ముఖ్యమంత్రికి చెప్పింది. ఇంకేముంది ఆ చిన్నారికి ఆయన చక్కని రన్నింగ్‌ షూస్‌, ట్రాక్‌ సూట్‌, ఇతర క్రీడా పరికరాలను కానుకగా ఇచ్చారు. భవిష్యత్తులో మంచి అథ్లెట్‌గా రాణించాలని ఆశీర్వదించారు. మరి మనమూ ఆ చిన్నారి మరిన్ని విజయాలు సాధించాలని ఆల్‌ ది బెస్ట్‌ చెబుదామా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని