ఇవి నిజాయతీ పెంచే దుకాణాలు!
హాయ్ ఫ్రెండ్స్.. మనకు పెన్నులో, పుస్తకాలో కావాలంటే పెద్దవాళ్లతో కలిసి స్టేషనరీ దుకాణానికి వెళ్తుంటాం. మనకు కావాల్సిన వస్తువులు తీసుకొని, అందుకు తగిన డబ్బును ఆ దుకాణదారుడికి ఇచ్చేస్తాం. అంతేకదా?.. కానీ, మన స్కూల్‌లోనే ఓ స్టేషనరీ దుకాణం ఉంటే.? కావాల్సిన వస్తువులు తీసుకొని, నిజాయతీగా వాటికి సరిపడా డబ్బులను అక్కడున్న డబ్బాలో వేసివస్తే..? - వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ! ఆ వివరాలే ఇవీ..
కేరళ రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇటీవల ప్రారంభించిన ‘హానెస్టీ షాప్స్’ అందరితో శెభాష్ అనిపించుకుంటున్నాయి. విద్యార్థులను చిన్నతనం నుంచే నిజాయతీ గల పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ దుకాణాలు సత్ఫలితాలిస్తున్నాయట. వీటిలోని వస్తువులు కూడా చకచకా అయిపోతున్నాయట.
మెరుగైన సమాజం కోసం..
‘నేటి బాలలే రేపటి పౌరులు’ అనే మాటను మీరు చాలాసార్లు వినే ఉంటారు. అటువంటి పిల్లలకు స్కూల్ దశ నుంచే నిజాయతీతోపాటు సామాజిక విలువలు బోధిస్తే.. బాధ్యతాయుత పౌరులుగా ఎదుగుతారు. ఇదే విషయాన్ని ఎర్నాకుళం పోలీసులు బలంగా నమ్మారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులతో మాట్లాడి.. తమ ‘హానెస్టీ షాప్స్’ ఆలోచనను ఆచరణలోకి తీసుకొచ్చారు. తొలుత ఎంపిక చేసిన ఏడు పాఠశాలల్లో పెన్నులు, పెన్సిళ్లు, నోట్ పుస్తకాలతోపాటు ఇతర స్టేషనరీ సామగ్రితో దుకాణాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
రిజిస్టర్ నిర్వహణ..
ప్రభుత్వ బడుల్లో ప్రారంభించిన ఈ దుకాణాల్లో ఎవరూ ఉండరు. విద్యార్థులే నేరుగా వెళ్లి వాళ్లకు అవసరమైన వస్తువులు తీసుకోవచ్చు. వాటిపైన పేర్కొన్న ధరల ప్రకారం.. కావాల్సిన వస్తువులకు అయ్యే డబ్బులను అక్కడే ఉండే డబ్బాలో వేయాల్సి ఉంటుంది. ఈ దుకాణాల నిర్వహణ బాధ్యతలను కొందరు విద్యార్థులే చూస్తుండటం గమనార్హం. ప్రతిరోజూ సాయంత్రం తరగతులు పూర్తయ్యాక, వారే.. ఆ డబ్బాలోని నగదును లెక్కిస్తుంటారు. ఆ వివరాలను ఓ రిజిస్టర్‌లో నమోదు చేసి, దాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి అప్పగిస్తారు. దుకాణాల దగ్గర సీసీ కెమెరాలు కానీ, ఇతరుల పర్యవేక్షణ కానీ ఏమీ ఉండదు. ఈ దుకాణాలు విద్యార్థుల్లో నిజాయతీని పెంపొందించడంతోపాటు వారిపైన సానుకూల ప్రభావం చూపుతుండటంతో త్వరలోనే మరిన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేయనున్నారట. ఇదంతా చూస్తుంటే.. చరిత్ర పుస్తకాల్లో చదువుకున్న రాజ్యాలూ, సంపదల రాశులూ, వస్తు మార్పిడి.. పాఠాలు గుర్తొస్తున్నాయి కదూ! ఒకసారి మీ టీచర్లతో ఈ ఆలోచనను పంచుకొని చూడండి నేస్తాలూ.. వారు సరేనంటే, మీ స్కూల్‌లోనూ ఓ దుకాణం రావొచ్చు!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
ఆస్ట్రాజెనెకా టీకాతో గుండెపై దుష్ప్రభావాలు: ప్రముఖ హృద్రోగ నిపుణుడి వ్యాఖ్యలు
-
India News
NEET PG 2023: ఎంబీబీఎస్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. నీట్ పీజీ పరీక్షకు ఇంటర్న్షిప్ కటాఫ్ గడువు పెంపు
-
Crime News
Aaftab: శ్రద్ధాను చంపి.. చికెన్ రోల్ తిన్నాడు
-
India News
రూ.50వేల చొప్పున తీసుకున్నారు.. భర్తల్ని వదిలేసి ప్రియుళ్లతో వెళ్లిపోయారు
-
Crime News
Crime News: మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ భార్య బలవన్మరణం
-
Politics News
Kotamreddy: అభిమానం ఉండాలి.. రూ.కోట్లుంటే గెలవలేరు: కోటంరెడ్డి