బస్తీ పిల్లలు.. బుజ్జి సినిమాలు!
హలో ఫ్రెండ్స్.. మనకు దగ్గరలోనో, కాస్త దూరంలోనో ఉండే ఏదో ఒక పాఠశాలకు వెళ్లి చదువుకొంటుంటాం. మరి మురికి వాడల్లో ఉండే పిల్లల సంగతి?.. వారికి తినడానికే సరిగా తిండి ఉండదు. ఇంక చదువు కూడానా?.. అందుకే, అటువంటి పిల్లల కోసమే ఓ అంకుల్ చాలా కష్టపడుతున్నారు. ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించి మరీ.. వాళ్లను అన్ని రకాలుగా తీర్చిదిద్దుతున్నారు. ఆ వివరాలే ఇవీ..
తమిళనాడు రాష్ట్రం మధురైలోని దాదాపు ఎనిమిది మురికి వాడల్లో నివసించే పిల్లలంతా కలిసి ఇటీవలే ఆరు లఘుచిత్రాలు (షార్ట్ ఫిలిమ్స్) తీశారు. వారి ప్రతిభను చూసి, అందరూ శెభాష్ అంటూ ఆశ్చర్యపోతున్నారు. కానీ, చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. వారి ప్రతిభ వెనక ఉన్నది జిమ్ అంకుల్ అని.
ప్రత్యేకంగా సెంటర్..
మధురై పరిధిలో ఎంపిక చేసిన ఎనిమిది మురికి వాడల్లోని పిల్లలంతా రోజూ చదువుకోవడంతోపాటు ఇతర రంగాల్లోనూ శిక్షణ పొందుతున్నారు. పేద కుటుంబాలకు చెందిన వీరికి తినడానికే ఆహారం సరిగా ఉండదు. అటువంటిది.. చదువుతోపాటు ఇతర అంశాలూ అంటే చాలా గ్రేట్ కదూ! ఒకరోజు బస్తీ పిల్లలు బడికి వెళ్లకుండా.. పనులు చేయడాన్ని జిమ్ అంకుల్ గమనించారు. అప్పుడే అటువంటి పిల్లల కోసం తనవంతుగా ఏదైనా చేయాలని ఆయన అనుకున్నారు. అలా ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించి, 28 ఏళ్లుగా మురికి వాడల్లోని పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు.
ఒకటీ రెండూ కాదు..
స్వచ్ఛంద సంస్థ తరఫున ఒక్కో మురికి వాడలో ప్రత్యేకంగా ఒక్కో కేంద్రాన్ని ప్రారంభించారు. అందులో ప్రతిరోజూ చిన్నారులకు పాఠాలతోపాటు ఆటలూ, ఇతర సాంకేతిక అంశాలూ నేర్పిస్తున్నారు. ప్రస్తుతం దాదాపు 400 మంది ఈ కేంద్రాల్లో చదువుకుంటున్నారు. ఇటీవల 27 మంది విద్యార్థులు ఆరు బృందాలుగా ఏర్పడ్డారు. భిన్నమైన కథాంశాలతో మొత్తం ఆరు లఘుచిత్రాలను తీశారు. వాటికంటే ముందుగానే.. సాంకేతికత వినియోగం, స్క్రిప్టు రైటింగ్, దర్శకత్వం తదితర అంశాలపైన సంస్థ ఆధ్వర్యంలో ఆ విద్యార్థులకు ప్రత్యేకంగా శిక్షణ అందించారు. కొద్దిరోజుల క్రితం వాటిని యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడంతో.. చూసిన వారంతా బాగున్నాయని ప్రశంసిస్తున్నారట. కేవలం తరగతి గదులకే పరిమితం కాకుండా.. ఇటువంటి వర్క్‌షాప్స్, శిక్షణతో విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుందని, తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని జిమ్ అంకుల్ చెబుతున్నారు. ఈ అంకుల్ స్ఫూర్తితో మన చుట్టుపక్కల ఉండే పేద పిల్లలకు, మనం కూడా చేతనైన సాయం చేద్దాం నేస్తాలూ.. సరేనా!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad: బాగ్‌లింగంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
-
India News
పరీక్షా హాలులో అమ్మాయిలను చూసి.. స్పృహ తప్పిపడిపోయిన ఇంటర్ విద్యార్థి
-
Ap-top-news News
Gudivada Amarnath: త్వరలో విశాఖ భవిష్యత్తు మారుతుంది: మంత్రి అమర్నాథ్
-
Ap-top-news News
Taraka Ratna: మెదడు సంబంధిత సమస్య మినహా తారకరత్న క్షేమం: విజయసాయిరెడ్డి
-
India News
బడ్జెట్ అంశాలు లీకవడంతో.. పదవిని కోల్పోయిన ఆర్థిక మంత్రి
-
Sports News
Hanuma Vihari: విహారి ఒంటి చేత్తో.. మణికట్టు విరిగినా బ్యాటింగ్