కృషి ఉంటే... ‘తరుషి’లవుతారు!
అనగనగా ఓ చిన్నారి. వయసేమో 12. సాధించిన బంగారు పతకాలేమో 151. ఇది చదవగానే ‘ఔరా’ అనిపించింది కదూ! అందుకే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారి దృష్టిలోనూ పడింది. ఇంతకూ ఆ చిన్నారి ఎవరు? తను అన్ని బంగారు పతకాలు ఎలా సాధించింది? ఎందులో సాధించిందో తెలుసుకోవాలని ఉందా..? అయితే ఇంకెందుకు ఆలస్యం. ఈ కథనం చదివేయండి.
నేస్తాలూ...! పంచకులకు చెందిన పన్నెండేళ్ల తరుషి అద్భుతాలు సృష్టిస్తోంది. తైక్వాండోలో ప్రతిభ చాటుతోంది. ఎవరూ తనను అందుకోలేనంత ఎత్తుకు ఎదుగుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఇప్పటి వరకు ఏకంగా 151 బంగారు పతకాలు తన ఖాతాలో వేసుకుంది. ఇంకా 40 రజత, 34 కాంస్య పతకాలు సాధించింది. మరిన్ని గెలుచుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది. అందుకే ఇంత చిన్న వయసులోనే ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. ప్రపంచానికి మన భారతదేశ సత్తా ఏంటో చాటుతోంది.
అతి పిన్న వయస్కురాలిగా...
నదేశంలో తైక్వాండోలో డిగ్రీ వన్, డిగ్రీ టూ బ్లాక్‌బెల్ట్ సాధించిన అత్యంత పిన్నవయస్కురాలిగానూ తరుషి రికార్డు సృష్టించింది. 2022 సంవత్సరానికిగాను ‘ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్’నూ కైవసం చేసుకుంది. లక్షరూపాయల నగదు బహుమతినీ సొంతం చేసుకుంది. అదే సమయంలో చదువును అశ్రద్ధ చేయడం లేదు. చక్కగా చదువుకుంటోంది. విద్యాభ్యాసానికీ తగిన సమయం కేటాయిస్తోంది. మంచి మార్కులూ తెచ్చుకుంటోంది. తాను ఇవన్నీ సాధించడానికి, చదువునూ, తైక్వాండోనూ సమన్వయం చేసుకోవడానికి వాళ్ల అమ్మ ప్రోత్సాహమే కారణం అని చెబుతోంది ఈ చిన్నారి. మన ప్రధాని నరేంద్రమోదీ నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. బాక్సింగ్‌లో సత్తా చాటిన మేరీకోమ్ తనకు ఆదర్శం అని చెబుతోంది. భవిష్యత్తులో మనదేశం తరఫున ఒలింపిక్ క్రీడల్లో పాల్గొని, బంగారు పతకం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. మరి మనమంతా తరుషి అనుకున్నది సాధించాలని కోరుకుందామా! తనకు మనసారా ఆల్ ది బెస్ట్ చెబుదామా!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Team India Final XI: గిల్ ఉంటాడా.. సూర్య వస్తాడా.. కీపర్ ఎవరు.. స్పిన్నర్ లెక్కేంటి?
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
Modi: ఆ దశాబ్ద కాలాన్ని మనం కోల్పోయాం.. విపక్షాలపై మోదీ ఫైర్
-
General News
Hyderabad: వాహనదారులకు అలర్ట్.. ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఖైరతాబాద్ కూడలి
-
World News
Turkeys earthquake: తుర్కియేలో భూకంప పన్ను ఏమైంది..? ప్రజల ఆగ్రహం..!
-
Politics News
Harish Rao: భాజపా ‘అమృత్కాల్’.. దేశ ప్రజలకు ఆపద కాలం: హరీశ్‌రావు