బాబోయ్.. చాంతాడంత భోజనబల్ల!
అమెరికాలోని అడాల్ఫో పాఠశాల విద్యార్థులు ఓ ఉపాధ్యాయుడి సారథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద భోజనబల్ల ్బద్త్చి౯‘్య్మ’౯i’ ్జ్న్చ౯్ట్శను సిద్ధం చేశారు. అంతేకాదు.. 62.38 మీటర్ల పొడవున్న ఆ బల్ల ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లోనూ చోటు దక్కించుకుంది.
హాయ్ నేస్తాలూ.. శుభకార్యాల్లోనో, పాఠశాలల్లో జరిగే కార్యక్రమాల్లోనో భోజనాల కోసం బల్లలను సిద్ధం చేయడం చూసే ఉంటారు. ఆహార పదార్థాలున్న పాత్రలను ఆ టేబుళ్లపైన పెట్టి, వచ్చిన వారందరికీ వడ్డిస్తుంటారు. ఇప్పుడదే ‘భోజనబల్ల’తో ఓ స్కూల్ విద్యార్థులు ప్రపంచ రికార్డు సాధించారు. ఆ వివరాలేంటో తెలుసుకోవాలంటే.. గబగబా ఇది చదివేయండి మరి!
అమెరికాలోని అడాల్ఫో పాఠశాల విద్యార్థులు ఓ ఉపాధ్యాయుడి సారథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద భోజనబల్ల (Charculerie board )ను సిద్ధం చేశారు. అంతేకాదు.. 62.38 మీటర్ల పొడవున్న ఆ బల్ల ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లోనూ చోటు దక్కించుకుంది.
అలా ఆలోచన..
ఈ పాఠశాలలో పీటర్ అనే వ్యక్తి దాదాపు 20 ఏళ్లుగా డిజైనింగ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అంతకుముందు ఆయన బొమ్మలు తయారు చేసేవారు. ఈ స్కూల్‌లో చేరాక.. ఒకసారి ఆయన ఏదో సమావేశానికి వెళ్లినప్పుడు అక్కడ భారీ పరిమాణంలో ఉన్న భోజనబల్లను చూశారట. ఇంటికొచ్చాక భోజనబల్ల రికార్డులకు సంబంధించిన వివరాలను ఇంటర్నెట్‌లో వెతికారు. అప్పుడే తన స్కూల్ విద్యార్థులతో ప్రపంచంలోనే అతి పెద్ద బల్లను తయారు చేయించాలని అనుకున్నారాయన.
50 మంది.. 3 నెలలు..
తన ఆలోచనను విద్యార్థులకు చెప్పి.. అందుకు తగినట్లుగా వారిని సన్నద్ధం చేశారా మాస్టారు. బడి ఆవరణలోనే ఉన్న వుడ్ ఫ్యాక్టరీలో రీసైకిల్ చేసిన వస్తువులతో మొదట చిన్న చిన్న బల్లలను తయారు చేశారు. వాటన్నింటినీ ఫ్యాక్టరీ నుంచి తెచ్చి, అప్పటికే టెంట్లు వేసి సిద్ధం చేసిన స్కూల్ ఫుట్‌బాల్ మైదానంలో వరుసగా పేర్చారు. ఇలా అమర్చేందుకే వాళ్లకు 45 నిమిషాలు పట్టిందట. ఆ పొడవాటి బల్లపైన దాదాపు 226 కేజీల మాంసం, పండ్లు, ఎండుఫలాలతోపాటు చీజ్ కూడా ఉంచారట. 50 మంది విద్యార్థులు కలిసి ఈ బల్లలను తయారు చేసేందుకు సుమారు మూడు నెలల సమయం పట్టిందట.
పెద్దల సాయంతో...
అతిపెద్ద భోజన బల్లగా గిన్నిస్ బుక్ ప్రతినిధులు వివరాలు నమోదు చేసుకున్న తర్వాత.. ఆ ఆహార పదార్థాలన్నింటినీ పంచేశారు. దీనంతటికీ అయిన ఖర్చును విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు స్థానికంగా నివసించే వ్యాపారులే భరించారట. అంతకుముందు ఈ రికార్డు చికాగోలోని ఓ సంస్థ పేరిట ఉండేది. వారు 2019లో 45.73 మీటర్ల భోజనబల్లను సిద్ధం చేశారు. నేస్తాలూ.. ఉపాధ్యాయుడి మార్గదర్శకంలో ఈ విద్యార్థుల రికార్డు భలే ఆసక్తిగా ఉంది కదూ!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
భారతీయులకు వీసాల జారీలో అమెరికా రికార్డు..!
-
Chandrayaan-3: ప్రజ్ఞాన్ రోవర్ మేల్కోకపోయినా ఇబ్బందేం లేదు: సోమనాథ్
-
Rajasthan : ఉప రాష్ట్రపతి తరచూ రాజస్థాన్‌కు ఎందుకొస్తున్నారు.. మీ పర్మిషన్ కావాలా?
-
Crime: డబ్బు కోసం దారుణ హత్య.. తీరా చూస్తే..!
-
Social Look: నజ్రియా వెకేషన్.. నయన్ సెలబ్రేషన్స్..!
-
Crime news మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. కస్టడీ నుంచి పారిపోయేందుకు నిందితుడి యత్నం!