రిత్వి.. ఓ బుజ్జి రచయిత!
హాయ్ నేస్తాలు.. బడి నుంచి ఇంటికొచ్చాక హోంవర్క్ రాయమంటేనే బద్దకిస్తాం. పరీక్షల్లో జవాబులు రాయాలన్నా.. తప్పదు కాబట్టి ఏదో ఒకటి రాసేస్తాం.
హాయ్ నేస్తాలు.. బడి నుంచి ఇంటికొచ్చాక హోంవర్క్ రాయమంటేనే బద్దకిస్తాం. పరీక్షల్లో జవాబులు రాయాలన్నా.. తప్పదు కాబట్టి ఏదో ఒకటి రాసేస్తాం. కానీ, ఓ నేస్తం మాత్రం చిన్న వయసులోనే ఏకంగా పుస్తకమే రాసేసింది. రికార్డూ దక్కించుకుంది. ఇంతకీ తనెవరో.. ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!
మహారాష్ట్రలోని పుణెకు చెందిన రిత్వి షిండేకు ప్రస్తుతం ఎనిమిది సంవత్సరాలు. తనకు చిన్నప్పటి నుంచి చదవడం, రాయడం అంటే చాలా ఆసక్తి. తాతయ్యను అడిగి రోజూ కథలు చెప్పించుకునేది. అంతేకాదు.. తను కూడా సొంతంగా చిన్న చిన్న కథలు అల్లి తల్లిదండ్రులకు చెబుతుండేది. పాఠశాలలో నిర్వహించే వ్యాసరచన పోటీల్లోనూ మంచి ప్రతిభ చూపేది.
కథ రాసి.. బొమ్మలు వేసి..
అలా చిన్న చిన్న కథలతో మొదలైన రిత్వి ప్రయాణం.. పుస్తకాలు రాసే వరకు చేరుకుంది. ఇటీవల ‘చిల్డ్రన్ అడ్వెంచర్’ అంశం మీద ఓ పుస్తకాన్ని రచించింది. దానికి ‘జర్నీ విత్ బ్రియాన్, ఆలిస్ అండ్ లీసా’ అని పేరు పెట్టింది. ఓ ప్రింటింగ్ సంస్థతో మాట్లాడి మరీ దాన్ని ప్రచురించింది. అందులో బొమ్మలు కూడా తానే స్వయంగా వేసింది. కల్పిత పాత్రలతో ఆకట్టుకునేలా కథను మలచడంతోపాటు అందుకు తగినట్లుగా బొమ్మలు వేయడం మాటలు కాదు కదా! ఇది తన మొదటి పుస్తకం కావడంతో రిత్వి సంతోషానికి అవధుల్లేవట. తన ప్రతిభతో ‘ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ ప్రతినిధులనూ మెప్పించింది. అందులో స్థానమూ దక్కించుకుంది. అదే స్ఫూర్తితో వెంటవెంటనే మరో మూడు పుస్తకాలు కూడా రాసేసిందట. వాటితోపాటు ముప్ఫైకి పైగా చిన్న చిన్న కథలు కూడా రాసింది. వాటన్నింటినీ కలిపి ఓ పుస్తకంలా తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉందీ నేస్తం. చదవడం, బొమ్మలు గీయడమే కాకుండా డ్యాన్స్ అంటే ఇష్టమట. నేస్తాలూ..
రిత్వి చాలా గ్రేట్ కదూ!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
కులాంతర వివాహం చేసుకున్నారని మూగ దంపతుల గ్రామ బహిష్కరణ
-
విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ నిలిచిపోయింది: భాజపా ఎంపీ జీవీఎల్
-
గృహరుణం... తొందరగా తీర్చేద్దాం
-
నేపాలీ షెర్పా ప్రపంచ రికార్డు
-
సుప్రీం కోర్టు ఆదేశాలనే మార్చేశారు.. పోలీసు కేసు పెట్టాలని ధర్మాసనం ఆదేశం
-
సిబ్బందిని మందలించిందని.. వ్యాపార భాగస్వామిని చితకబాదాడు..