మేధాశక్తిలో ‘అధర’గొట్టింది!
హలో ఫ్రెండ్స్.. మేధాశక్తికి ప్రామాణికంగా భావించే ఐక్యూ పేరు వినగానే మనకు ప్రముఖ శాస్త్రవేత్తలు ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్ గుర్తుకొస్తారు కదూ!
హలో ఫ్రెండ్స్.. మేధాశక్తికి ప్రామాణికంగా భావించే ఐక్యూ పేరు వినగానే మనకు ప్రముఖ శాస్త్రవేత్తలు ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్ గుర్తుకొస్తారు కదూ! అయితే, ఇటీవల ఓ నేస్తానికి వారిద్దరి కన్నా ఎక్కువ ఐక్యూ ఉన్నట్లు తెలిసింది. మరి.. అంత మేధస్సు ఉన్న ఆ నేస్తం ఇప్పుడేం చేస్తుందో తెలుసుకోవాలని ఉందా? - ఇంకెందుకాలస్యం.. ఈ కథనం చదివేయండి మరి..
అమెరికాలోని మెక్సికోకు చెందిన అధర పెరెజ్‌కు ప్రస్తుతం 11 సంవత్సరాలు. సాధారణంగా ఈ వయసులో ఎవరైనా ఆరో తరగతో, ఏడో తరగతో చదువుతుంటారు. కానీ, ఈ బాలిక మాత్రం గణితంలో ఏకంగా పీజీ చేస్తోంది. తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
సమస్య ఉన్నా..
మూడేళ్ల వయసున్నప్పుడు పెరెజ్‌కు బుద్ధిమాంద్యం ఉన్నట్లు వైద్యుల పరీక్షలో తెలిసింది. దాంతో స్కూల్‌లో అందరూ తనను ఆటపట్టించేవారు. కొన్నాళ్లకు అక్కడ స్నేహితుల అల్లరిని భరించలేక, బడికెళ్లడమే మానేసింది. దాంతో తల్లిదండ్రులు ఈ నేస్తాన్ని దివ్యాంగుల కోసమే ప్రత్యేకంగా నడిపిస్తున్న ఓ శిక్షణ సంస్థలో చేర్చారు. గణితం అంటే తనకున్న ఆసక్తిని గమనించిన అక్కడి నిర్వాహకులు ఐక్యూ పరీక్షలు నిర్వహించారు. ఆ ఫలితం చూసిన వారంతా నోరెళ్లబెట్టారట. ఎందుకంటే.. ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్ ఐక్యూ 160 ఉంటే.. పెరెజ్‌ది మాత్రం 162 ఉందట. అలా ఆ సంస్థలో అయిదేళ్లకే ప్రాథమిక విద్యను, మరుసటి ఏడాదిలోనే స్కూల్ చదువును పూర్తి చేసేసింది.
బాలికలకు అంతరిక్ష పాఠాలు
తన ప్రతిభతో ఇప్పటికే సిస్టమ్స్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ చదివిన పెరెజ్, ప్రస్తుతం గణితంలో పీజీ చేస్తోంది. తాను చదువుకోవడంతోపాటు మెక్సికన్ స్పేస్ ఏజెన్సీ తరఫున వివిధ స్కూళ్లలోని బాలికలకు అంతరిక్షానికి సంబంధించిన పాఠాలూ చెబుతోందట. అంతేకాదు.. ఎప్పటికైనా వ్యోమగామి కావాలనేది తన లక్ష్యం. అందుకే.. నాసాకు, వ్యోమగాములకు మధ్య ఉండే సమాచార మార్పిడి తదితర అంశాలకు సంబంధించిన పరీక్షలకు సన్నద్ధమవుతోంది. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే 17 ఏళ్ల వయసులో అంతరిక్షానికి వెళ్లనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. బుద్ధిమాంద్యంతో బాధపడుతూ, పిన్న వయసులోనే స్పేస్‌కు వెళ్లిన మొదటి వ్యక్తిగా కూడా తానే నిలవనుందట. ఇంత సాధించింది కాబట్టే ప్రముఖ మ్యాగజైన్ల కవర్ పేజీలపైన పెరెజ్ ఫొటో వచ్చింది. తను మంచి వక్త కూడా. ఇప్పటికే వివిధ వేదికలపైన అనేక ప్రసంగాలు ఇచ్చింది. అరిజోనా యూనివర్సిటీలో ఆస్ట్రోఫిజిక్స్ చదివే అవకాశం వచ్చినా, వీసా ఇబ్బందులతో అక్కడికి వెళ్లలేకపోయిందట. అయినా, తాను మాత్రం పట్టు విడవడం లేదు. ఎలాగైనా స్పేస్ సైంటిస్ట్ అయ్యి తీరుతానని ధీమాగా చెబుతోంది. మరి ఈ నేస్తానికి మనమూ ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా.!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World Culture Festival: రెండో రోజూ ఉత్సాహంగా కొనసాగిన ప్రపంచ సాంస్కృతిక సంరంభం..
-
రీల్స్ చేస్తున్న మహిళా ఉపాధ్యాయులు.. లైక్స్ కోసం విద్యార్థులపై ఒత్తిళ్లు
-
Gender discrimination in AI: ఏఐలోనూ లింగవివక్ష!
-
Paris: పారిస్‌లో నరకం చూపిస్తున్న నల్లులు
-
బిహార్ సీఎం కాన్వాయ్ కోసం.. పసిబిడ్డతో గంటసేపు ఆగిన అంబులెన్స్
-
World Culture Festival: రెండో రోజు ఉత్సాహంగా యోగా, మెడిటేషన్