ఉపాధ్యాయులకు వందనం

డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌.. భారత దేశ తొలి ఉపరాష్ట్రపతి. రెండో రాష్ట్రపతి. అంతకుముందు ఉపాధ్యాయుడు, విద్యావేత్త. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఏటా ఆయన జయంతి సందర్భంగా సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవం(టీచర్స్‌ డే)గా జరుపుకొంటున్నాం.

Published : 05 Sep 2020 02:11 IST

డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌.. భారత దేశ తొలి ఉపరాష్ట్రపతి. రెండో రాష్ట్రపతి. అంతకుముందు ఉపాధ్యాయుడు, విద్యావేత్త. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఏటా ఆయన జయంతి సందర్భంగా సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవం(టీచర్స్‌ డే)గా జరుపుకొంటున్నాం. 1882లో తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణిలో రాధాకృష్ణన్‌ జన్మించారు. వారి పూర్వీకులది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి.

ఈ రోజే ఎందుకంటే..?

రాధాకృష్ణన్‌ 1962లో రాష్ట్రపతి అయిన తర్వాత మిత్రులు, పూర్వ విద్యార్థులంతా ఒకసారి ఆయనను కలిశారు. ‘మీ పుట్టిన రోజు వేడుకలు జరుపుతాం’ అని అడిగారు. అందుకాయన ‘నా పుట్టినరోజును జరుపుకోవడం కన్నా ఆరోజు గురువుల్ని పూజించడం మంచిది’ అని అన్నారు. ఉపాధ్యాయ వృత్తిపట్ల ఆయనకున్న నిబద్ధత అలాంటిది. అప్పటి నుంచి సెప్టెంబరు 5ను గురుపూజోత్సవంగా చేసుకుంటున్నాం. ప్రపంచమంతా మాత్రం అక్టోబరు 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుతోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని