ఊయల.. చేసేద్దామిలా!

ఐస్‌ పుల్లల్ని ఏం చేస్తాం.. ఇంకేం చేస్తాం. ఐస్‌ తినేశాక చెత్త బుట్టలో పడేస్తాం... అంటారేమో..! కానీ వాటితో చక్కటి చిన్ని ఊయల తయారు చేసుకోవచ్ఛు అది ఎలాగో తెలుసుకుందామా?!

Updated : 28 Sep 2020 01:18 IST

ఐస్‌ పుల్లల్ని ఏం చేస్తాం.. ఇంకేం చేస్తాం. ఐస్‌ తినేశాక చెత్త బుట్టలో పడేస్తాం... అంటారేమో..! కానీ వాటితో చక్కటి చిన్ని ఊయల తయారు చేసుకోవచ్ఛు అది ఎలాగో తెలుసుకుందామా?!

ముందుగా పది ఐస్‌పుల్లల్ని తీసుకోండి. ఒకదానిపక్కన ఒకదాన్ని పరుస్తూ వెళ్లాలి. అన్నింటినీ సమానంగా సర్దుకుని పైన ఒక పుల్ల, కింద మరో పుల్లను అడ్డంగా జిగురుతో అతికించుకోవాలి.

అమ్మానాన్న సాయంతో..

కాసేపు ఆరిన తర్వాత కత్తెరతో అడ్డంగా కత్తిరించుకోవాలి. దీనికోసం అమ్మానాన్న సాయం తీసుకోవడం మాత్రం మరిచిపోవద్ధు ఇప్పుడు మరో రెండు పుల్లల్ని తీసుకుని కత్తిరించుకున్న పుల్లల చివర అతికించుకోవాలి. తర్వాత వీటిని ‘v’ ఆకారంలో జిగురు సాయంతో సిద్ధం చేసుకోవాలి.. ఇది ఊయల పైకప్పు అన్నమాట. మరో రెండు పుల్లల్ని తీసుకుని పైకప్పు చివరల్లో అడ్డంగా అమర్చుకోవాలి.

ఛట్రం సిద్ధం చేసుకోవాలి

పైకప్పు పూర్తైన తర్వాత.. నాలుగు పుల్లల్ని తీసుకుని స్తంభాల్లా అతికించుకోవాలి. మరో నాలుగు పుల్లలతో చిత్రంలో చూపించినట్లు సిద్ధం చేసుకోవాలి. మొదట్లో తయారు చేసుకున్నట్లే.. ఈ సారి ఏడు పుల్లలతో చేయాలి. దీన్ని ఇంతకు ముందే చేసిపెట్టుకున్న ఊయల పైకప్పు స్తంభాలకు కిందవైపున జిగురుతో అతికించాలి. ఇప్పుడిక పుల్లలతో చిన్న సోఫాలాగా చేసుకోవాలి. దీనికి నాలుగువైపులా నాలుగు కర్రపుల్లల్ని అతికించుకోవాలి. మరో కర్రపుల్ల ఆధారంగా దారం సాయంతో వేలాడేలా సిద్ధం చేయాలి. ఇప్పుడు వీటిని ఇంతకు ముందే తయారు చేసి పెట్టుకున్న ఊయల ఛట్రంలో అతికించుకుంటే సరి. అందాల ఊయల సిద్ధం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని