జనం లేని రాజధాని!

రాజధాని అంటే నిత్యం వాహనాల రద్దీ, ఇసుకేస్తే రాలని జనం.. గుర్తుకు వస్తాయి. కనీసం రోడ్డు దాటాలన్నా నరకమే. కానీ

Updated : 13 Oct 2020 00:39 IST

రాజధాని అంటే నిత్యం వాహనాల రద్దీ, ఇసుకేస్తే రాలని జనం.. గుర్తుకు వస్తాయి. కనీసం రోడ్డు దాటాలన్నా నరకమే. కానీ ఓ దేశ రాజధానిలో మాత్రం దారులను కళ్లుమూసుకుని మరీ దాటొచ్చు. అయ్యో ప్రమాదం కదా! అంటారేమో.. కానీ అక్కడ వాహనాలు చాలా..చాలా.. తక్కువ. ఇదంతా మయన్మార్‌ రాజధాని నెపిడా గురించి...
లండన్‌ నగరం కంటే ఇది నాలుగురెట్లు పెద్దది. జనాలు మాత్రం లక్షల్లోనే.. కనిపిస్తారు. నిర్మాణాలు, సౌకర్యాలు భూతల స్వర్గాన్ని తలపిస్తాయి. కానీ దీనికి భూతాల నగరంగా పేరు వచ్చింది. నెపిడా విస్తీర్ణం  7,054 చదరపు కిలోమీటర్లు. 2016 లెక్కల ప్రకారం ఇక్కడ కేవలం 9,24,608 మంది మాత్రమే నివసిస్తున్నారు.
నిజానికి మొదట్లో మయన్మార్‌ రాజధాని యాంగాన్‌. సైనికపాలన తర్వాత నెపిడాకు మార్చారు. 15 ఏళ్ల కిందటే ఏకంగా రూ.28వేల కోట్లు వెచ్చించి మరీ సర్వాంగ సుందరంగా నిర్మించారు. భవిష్యత్తులో విస్తరించేందుకూ అప్పుడే ప్రణాళిక తయారు చేశారు. విలాసవంతమైన హోటళ్లు, షాపింగ్‌ మాళ్లు, వైఫై,  గోల్ఫ్‌ కోర్సులు, నిత్యం విద్యుత్తు, ఏకంగా 20 వరుసల రోడ్లు ఇలా ఎన్నో సౌకర్యాలున్నాయి. కానీ వీటిని వినియోగించుకునేందుకే తగిన సంఖ్యలో జనం లేరు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని