పెన్సిళ్లపై సీతాకోకచిలుకలు!

పిల్లలూ.. మనకు సీతాకోకచిలుకలు అంటే బోలెడు ఇష్టం కదా! రంగురంగుల రెక్కలతో అవి ఎగురుతుంటే.. వాటిని పట్టుకునేందుకు చాలా ప్రయత్నిస్తుంటాం..

Updated : 01 Mar 2021 01:23 IST

చూడండి.. చెయ్యండి!

పిల్లలూ.. మనకు సీతాకోకచిలుకలు అంటే బోలెడు ఇష్టం కదా! రంగురంగుల రెక్కలతో అవి ఎగురుతుంటే.. వాటిని పట్టుకునేందుకు చాలా ప్రయత్నిస్తుంటాం.. అలాంటి సీతాకోకచిలుకలను మనమే చేసుకుందాం. నిజమైనవి మాత్రం కాదు ఫ్రెండ్స్‌.. రంగు కాగితాలతో తయారైన వాటిని పెన్సిళ్లకో, పెన్నులకో అతికించుకుంటే భలే ఉంటుంది..!!
* కావాల్సిన వస్తువులు
1. రంగు కాగితాలు  2. పెన్సిల్‌   3. కత్తెర, జిగురు

ఎలా చేయాలంటే..
ముందుగా చతురస్రం ఆకారంలో ఒక రంగు కాగితాన్ని తీసుకోవాలి. దాన్ని సగానికి మలిచి.. పెన్సిల్‌తో ఒకవైపు సీతాకోకచిలుక రెక్కల మాదిరి గీయండి. గీసేముందే ఒకటికి రెండుసార్లు ప్రాక్టీస్‌ చేసుకోండి. ఆ గీతల వెంబడి జాగ్రత్తగా పెద్దలసాయంతో కత్తిరించండి. ఇప్పుడు ఆ మడతను విడదీస్తే.. సీతాకోకచిలుక రెక్కలు రెడీ అయినట్లే. తర్వాత మొదట తీసుకున్న కలర్‌ కాకుండా మరో పేపర్‌ తీసుకోండి. ఇది కొంచెం చిన్నగా ఉండేలా చూసుకోండి. ఇదివరకు చేసినట్లే.. సీతాకోకచిలుక రెక్కల మాదిరి గీసి కత్తిరించండి. ఇది చిన్న చిలుక అన్నమాట. ఇప్పుడు పెద్ద దాని మధ్యలో ఫొటోలో చూపించినట్లు పెన్సిల్‌ ఉంచండి. చిన్న దాని రెక్కలకు జిగురు రాసి.. పెద్ద రెక్కలకు అంటించి.. అంచులను గట్టిగా నొక్కండి. మధ్యలో ఉన్న పెన్సిల్‌ అస్సలు కదలకుండా చూసుకోవాలి. అంతే.. తేలికగా సీతాకోకచిలుక మీ కళ్ల ముందు ఉన్నట్లే. ఇలాంటివి ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసుకొని మీ దగ్గరున్న అన్నింటికి అతికించండి. స్కూల్‌కు వెళ్లాక స్నేహితులకు చూపిస్తే.. వాళ్లు వావ్‌ అని అనాల్సిందే మరి..!!

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని