చిటికెలో చేప బొమ్మ చేసేద్దాం..!

పిల్లలూ.. ‘మీకు రకరకాల క్రాఫ్ట్స్‌ చేయడం అంటే ఇష్టమా?’ అయితే మనకు అందుబాటులో ఉండే వస్తువులతో రంగురంగుల చేపను సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..!! 

Updated : 15 Mar 2021 01:19 IST

చూడండి.. చెయ్యండి

పిల్లలూ.. ‘మీకు రకరకాల క్రాఫ్ట్స్‌ చేయడం అంటే ఇష్టమా?’ అయితే మనకు అందుబాటులో ఉండే వస్తువులతో రంగురంగుల చేపను సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..!! 


కావాల్సిన వస్తువులు

1. పేపర్‌ ప్లేట్‌
2. రంగు కాగితాలు, నల్లని మార్కర్‌
3. కత్తెర, జిగురు, ఏదైనా ఒక రంగు


ఎలా చేయాలంటే..

ముందుగా ఒక పేపర్‌ ప్లేట్‌ తీసుకోండి. మీకు నచ్చిన ఏదో ఒక రంగు వేయండి. మార్కర్‌తో అయినా కలర్‌ చేయొచ్చు. కొద్దిసేపు ఆరిన తర్వాత దాన్ని ఒక ఛార్ట్‌పైన బోర్లించండి. ప్లేట్‌ ఒక చివర ‘‌v’ ఆకారంలో కత్తిరించి.. ఎదురుగా ఫొటోలో చూపించినట్లు అతికించండి. అంటే, అది చేప తోక అన్నమాట. ఇప్పుడు అయిదారు రకాల కలర్‌ పేపర్లు తీసుకొని చిన్న చిన్న వృత్తాలను కత్తిరించుకోండి. వాటిని జిగురు సహాయంతో ప్లేట్‌ మీద అతికించండి. అంటే, చేప శరీరం పైన ఉండే పొలుసుల మాదిరి అన్నమాట. ఇప్పుడు ఇంకో రంగు పేపర్‌ తీసుకొని చేప మొప్పల (gills) మాదిరి కత్తిరించి.. రెండు చివర్లలో అతికించాలి. అంతే.. రంగురంగుల చేప సిద్ధం అయినట్లే. ఇలాంటివి ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసుకొని మీ గదిలో అలంకరించుకోవడమే.. బంధువులు, స్నేహితులకు చూపిస్తే.. వాళ్లు వావ్‌ అని అనాల్సిందే..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని