ఆటాడేద్దామా!

అబ్బ.. ఇంట్లోనే ఖాళీగా ఉంటే బోరు కొట్టేస్తుంది కదూ... అయితే ఒక కొత్త ఆట నేర్చుకుందామా? ఆడటమూ చాలా అంటే చాలా సులువే...

Updated : 02 Apr 2021 01:10 IST

ఆట

అబ్బ.. ఇంట్లోనే ఖాళీగా ఉంటే బోరు కొట్టేస్తుంది కదూ... అయితే ఒక కొత్త ఆట నేర్చుకుందామా? ఆడటమూ చాలా అంటే చాలా సులువే... చదివేసి హాయిగా ఆడేయండి!

కావాల్సినవి:
ఇంట్లో ఉన్న వస్తువులే. పుస్తకాలు, బంతి, గుండీలాంటి గుండ్రటి వస్తువులు, త్రిభుజాకారంలో కత్తిరించుకున్న కాగితపు ముక్కల్లాంటివి, కాగితాలు, పెన్సిల్‌, గడియారం

ఎలా ఆడాలంటే?
* ఇద్దరి నుంచి ఎంతమందైనా ఆడొచ్చు.
* పైన చెప్పిన వస్తువులన్నింటిని ఒక చోట ఉంచాలి.
* ఓ నాలుగు కాగితాలు తీసుకుని పెన్ను లేదా పెన్సిల్‌తో వాటిపై ఒక చతురస్రం, దీర్ఘచతురస్రం, వృత్తం, త్రిభుజాల్ని గీయాలి. ఇదంతా ఒక సెట్టు. ఎంతమంది ఆడితే అన్ని సెట్టులు తయారు చేసి పెట్టుకోవాలి.
* ఇంకేముంది.... టైం పెట్టుకుని వన్‌.. టూ.. త్రీ.. అందరూ ఆ కాగితాల్ని పట్టుకుని సిద్ధంగా ఉండాలి.
* నిర్ణీత సమయంలో ఇందాక చెప్పినట్టు ఒక దగ్గర ఉంచిన వస్తువుల్లోంచి ఒక్కోటి తీసుకోస్తూ కాగితాలపై ఉన్న గుర్తుల్ని బట్టి సర్దాలి.
* ఎవరు ఎక్కువగా సరిగ్గా ఆ వస్తువుల్ని గుర్తుల దగ్గర పెడతారో వారే విజేత!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని