చెప్పుకోండి చూద్దాం

ఇక్కడ కొన్ని అసంపూర్తి వాక్యాలున్నాయి. ఆ ఖాళీల్లో ఏమి ఉండాలో చెప్పుకోండి చూద్దాం....

Published : 05 Apr 2021 00:11 IST

ఇక్కడ కొన్ని అసంపూర్తి వాక్యాలున్నాయి. ఆ ఖాళీల్లో ఏమి ఉండాలో చెప్పుకోండి చూద్దాం.


క్విజ్‌.. క్విజ్‌..

1. తెలుగు నెలల్లో మొదటిది ఏది?
2. ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని అన్నది ఎవరు?
3. ‘శ్రీశ్రీ’ పూర్తి పేరు ఏంటి?
4. ‘అమరజీవి’ అని ఎవరికి పేరు?
5. ‘వికటకవి’ అని ఎవర్ని పిలుస్తారు?


చెప్పగలరా!

1. పండు.. పండు.. ముళ్ల పండు. పట్టుకుంటే గుచ్చుతుండు. తిన్నామంటే తియ్యగుండు. ఏంటది?
2. ఒళ్లంతా పూలంట.. పసుపు ఎరుపుల మేళవింపంట.. కనుల పండుగ నా మేనంతా.. ఎర్రటి ఎండలో నీడనిచ్చే గొడుగంట.. ఇంతకీ నేను ఎవరంట?
3. నేనొక పండు. నాలో పోషకాలు మెండు. నా పేరు ఓ జంతువుదై ఉండు. తెలిసిందా నేను ఎవరో?
4. అది కారు కాని కారు. ఇంధనం అవసరమే లేదు. పరుగులో మహాజోరు కానీ.. రోడ్డుతో పనేలేదు. ఏంటది చెప్పుకోండి చూద్దాం?
5. మీరు నా నుంచి ఎంత తోడుకుంటే.. నేను అంత పెద్దగా తయారవుతా.. నేనెవరో తెలిసిందా?


వాక్యాల్లో వ్యక్తుల పేర్లు

ఈ వాక్యాల్లో వ్యక్తుల పేర్లు దాగి ఉన్నాయి. జాగ్రత్తగా చదివి కనిపెట్టండి చూద్దాం?

1. నిన్నే.. చెప్పరా మునగకాయలు ఎక్కడ పెట్టి మరిచిపోయావో!
2. నీకు తెలుసా.. గర్‌.. గర్‌..మనే శబ్దం అదిగో అక్కడి నుంచే వస్తోంది.  
3. ఇప్పటికే ఇలాంటి విపత్తులు ఎన్నో చూశాం. భవిష్యత్తు గురించి మాకు పెద్దగా బాధ లేదు మనవడా!
4. నేను చెప్పింది లీప్‌ సంవత్సరం గురించి.. నీకు అర్థమవుతోందా?  
5. ఇదిగో నిన్నే.. ఇటు రా..! జున్నుముక్క కాస్త రుచి చూద్దువు గానీ..


అక్షరాలతో ఆట

ఇక్కడ కొన్ని ఆంగ్ల పదాలు ఉన్నాయి. అవే అక్షరాలను ఎటునుంచైనా ఉపయోగించి ఎన్ని అర్థవంతమైన పదాలు రాయగలరో ప్రయత్నించండి చూద్దాం..
1) picture
2) friend


ఆ ఒక్కటి ఏది?

ఇక్కడ కొన్ని భాషల పేర్లు ఉన్నాయి. వాటిలో ఒక్కటి మాత్రం మిగతా వాటికి భిన్నంగా ఉంది. అదేదో కనిపెట్టండి చూద్దాం..  

తెలుగు, హిందీ, ఒరియా, మరాఠీ, ఇంగ్లిష్‌, కన్నడ, తమిళ్‌


సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3శ్రీ3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి.
ఏదీ రెండుసార్లు రాకూడదు.

జవాబు


దారేది?

ఈ కోడి  తన గుడ్లలో ఒకదాన్ని ఎక్కడో పెట్టి మరిచి పోయింది. మీరు దానికి దారి చూపి సాయం చేస్తారా?


నేను గీసిన బొమ్మ!

జవాబులు

చెప్పుకోండి చూద్దాం: 1.బువ్వా 2.విస్తరి 3.కాసిన 4.గోడ 5.బంగారం 6.అరిచే   క్విజ్‌.. క్విజ్‌.. : 1.చైత్రం 2.శ్రీకృష్ణదేవరాయలు 3.శ్రీరంగం శ్రీనివాసరావు 4.పొట్టి శ్రీరాములు 5.తెనాలి రామకృష్ణుడు  
చెప్పగలరా!: 1.పైనాపిల్‌ 2.తురాయి చెట్టు 3.డ్రాగన్‌ ఫ్రూట్‌ 4.పుకారు 5.గొయ్యి  
వాక్యాల్లో వ్యక్తుల పేర్లు: 1.రాము 2.సాగర్‌ 3.శాంభవి 4.దిలీప్‌ 5.రాజు అక్షరాలతో ఆట : 11.put, cure, pure, cut, cute, ripe, tier, tire, pet, true 2. find, rid, ride, end,
den, fin, fine, die

ఆ ఒక్కటి ఏది : ఇంగ్లిష్‌ (మిగిలినవన్నీ భారతీయ భాషలు)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని