చిత్రం చూసి చెప్పేయ్‌!

ఇక్కడున్న ఆధారాలను బట్టి జవాబులు చెప్పగలరేమో ప్రయత్నించండి.

Updated : 09 Dec 2021 04:28 IST

ఇక్కడున్న ఆధారాలను బట్టి జవాబులు చెప్పగలరేమో ప్రయత్నించండి.


క్విజ్‌.. క్విజ్‌...

1. తాజ్‌మహల్‌ను కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది?
2. మనదేశంలో.. ఎక్కువమంది కవలల పిల్లలు పుట్టే గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది?
3. ఏకంగా.. 436 మందిని చంపి ‘గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లోకి ఎక్కిన పులి పేరేంటి?
4. మనదేశంలో అత్యధిక మంది ఉద్యోగులున్న సంస్థ ఏది?
5. ఏ చెట్టు కలప.. వజ్రం కంటే కూడా ఖరీదైనది?
6. అధికారిక రాజధాని నగరమంటూ లేని ఏకైక దేశం పేరేంటి?


అటు ఇటు.. ఇటు అటు!

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి. ఓసారి ప్రయత్నించండి.

1. పాపరిలనసు
2. పాకనలరాచఅ
3. పధినాతిసే
4. టచబారా
5. గజననిరాధారం
6. వాముపరరి
7. నిసైడుకు
8. టడకోగో


అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


అర్థమేంటబ్బా!

నేస్తాలూ! ఇక్కడున్న ఆంగ్ల పదాలు సంక్షిప్తంగా ఉన్నాయి. వాటికి పూర్తి రూపాన్ని రాయగలరేమో ప్రయత్నించండి.


ఆటకు ఆట.. మెదడుకు మేత!

ఇక్కడ పదాలతో ఓ ఆట ఆడేద్దామా! అదేంటంటే ఇక్కడ కొన్ని పదాలున్నాయి. ప్రతి పదంలోనూ ఒక తప్పుంది. అది గుర్తుపట్టి అసలు పదమేంటో చెప్పాలి. మరి ఆడేద్దామా!

1.ప్రార్ధన
2.అన్నప్రాసన
3.మౌళిక
4.స్థంభం
5.విధ్యాలయం


జత కలిసే..!

ఈ చిత్రంలో రెండు పదాలు దాగున్నాయి. ప్రతి వృత్తంలోని అక్షరాలను సరైన క్రమంలో అమరుస్తూ.. ఆ రెండు పదాలేంటో కనిపెట్టండి.


నేను గీసిన బొమ్మ


జవాబులు

చిత్రం చూసి చెప్పేయ్‌! :  1.CUPBOARD 2. CATFISH 3. EARPHONE 4.FOOTBALL

క్విజ్‌.. క్విజ్‌..: 1.22 సంవత్సరాలు 2.కేరళ 3.చంపావత్‌ పులి 4.రైల్వే  5.అగర్‌వుడ్‌ 6.నౌరు

అటు ఇటు.. ఇటు అటు: 1.సుపరిపాలన 2.అరాచక పాలన 3.సేనాధిపతి 4.రాచబాట 5.రాజధాని నగరం 6.పరివారము 7.సైనికుడు 8.కోటగోడ 

అది ఏది?: 3

అర్థమేంటబ్బా! :  1.Direct to Home 2.British Broadcasting Corporation. 3.Bharat Heavy Electricals Limited 4.Radio Detection And Ranging 5.Board of Control for Cricket in India

ఆటకు ఆట.. మెదడుకు మేత! :  1.ప్రార్థన 2.అన్నప్రాశన 3.మౌలిక 4.స్తంభం 5.విద్యాలయం

జత కలిసే..! : colorful, creation


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని