నేనేం చేస్తానంటే.. !

హాయ్‌ ఫ్రెండ్స్‌, త్వరలో మనకు నూతన సంవత్సరం రాబోతుంది కదా! 2022లో నేను ఏం చేస్తానంటే ముందు అల్లరి తగ్గించుకుని, బుద్ధిగా అమ్మానాన్నలు చెప్పిన మాట వింటాను. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు ఎప్పటికప్పుడు వాయిదా వేయకుండా

Updated : 30 Dec 2021 05:35 IST

మంచిపేరు తెచ్చుకుంటా..
హాయ్‌ ఫ్రెండ్స్‌, త్వరలో మనకు నూతన సంవత్సరం రాబోతుంది కదా! 2022లో నేను ఏం చేస్తానంటే ముందు అల్లరి తగ్గించుకుని, బుద్ధిగా అమ్మానాన్నలు చెప్పిన మాట వింటాను. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు ఎప్పటికప్పుడు వాయిదా వేయకుండా చదివి, మంచి మార్కులు తెచ్చుకుందాం అనుకుంటున్నాను. పెద్దవారితో గౌరవంగా, తోటి వాళ్లతో స్నేహంగా ఉంటూ మంచి పేరు తెచ్చుకుంటాను. నా వస్తువులను, పుస్తకాలను చక్కగా సర్దుకుంటాను. అమ్మకు సాయం చేస్తాను. అందరితో స్నేహంగా ఉంటూ ‘బుద్ధిమంతురాలు’ అనిపించుకుంటాను.

- సీహెచ్‌. జిత్యనాగశ్రీ, అయిదో తరగతి, ఉయ్యూరు

నేస్తాలూ! మీరూ ఇలాగే 2022లో కొన్ని నిర్ణయాలు తీసుకుందాం అనుకుంటున్నారా? అయితే అవేంటో చెబుతూ.. మీ పేరు, ఊరు, తరగతి మొదలైన వివరాలతో మాకు మెయిల్‌ చేయండి.

email: hai@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని