నేనేం చేస్తానంటే!

హాయ్‌ ఫ్రెండ్స్‌!  నేను ఈ సంవత్సరం ఏం చేయాలనుకుంటున్నా అంటే.. నా పుస్తకాలను, బొమ్మలను నీట్‌గా ఉంచుకుంటాను. అమ్మకు ఎదురుచెప్పకుండా తన మాట వింటాను.

Published : 09 Jan 2022 00:22 IST

అల్లరి చేయను!  

హాయ్‌ ఫ్రెండ్స్‌!  నేను ఈ సంవత్సరం ఏం చేయాలనుకుంటున్నా అంటే.. నా పుస్తకాలను, బొమ్మలను నీట్‌గా ఉంచుకుంటాను. అమ్మకు ఎదురుచెప్పకుండా తన మాట వింటాను. టీవీ, ఫోన్‌ చూడకుండా.. ఆ సమయంలో అమ్మకు పనుల్లో సాయం చేస్తాను. నా పనుల్ని నేను చేసుకోవడం నేర్చుకుంటాను. స్కూల్‌కు వెళ్లనని అస్సలు మారాం చేయను. అల్లరి చేయకుండా బుద్ధిగా చదువుకుంటాను. ప్రతి రోజూ మర్చిపోకుండా హోం వర్క్‌ చేసి, టీచర్‌ దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాను.  

-  సయ్యద్‌ ఐజా హునైన్‌ , యూకేజీ, ఖమ్మం


నేస్తాలూ! మీరూ ఇలాగే 2022లో కొన్ని నిర్ణయాలు తీసుకుందాం అనుకుంటున్నారా? అయితే అవేంటో చెబుతూ.. మీ పేరు, ఊరు, తరగతి మొదలైన వివరాలతో మాకు మెయిల్‌ చేయండి. email: hai@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని