భలే భలే.. బడి..!
‘బడిలో ఏముంటాయి?’ అని ఎవరైనా అడిగితే.. ‘ఆ.. ఏముంటాయి.. బ్లాక్‌బోర్డు, చాక్‌పీసులు, టేబుళ్లు, బల్లలు, కుర్చీలు...’ అని సమాధానం చెబుతాం. కానీ కేరళలోని ఓ బడిలో మాత్రం వీటన్నింటితో పాటు పర్యావరణ స్పృహ ఉంది! ప్రకృతి పరిరక్షణా ఉంది. ‘కార్బన్ డై ఆక్సైడ్’ను తగ్గించే వ్యూహమూ ఉంది. అన్నింటికీ మించి పరిసరాల మీద ప్రేమ ఉంది.
కేరళ రాష్ట్రంలోని కూనమ్మవులో చవరదర్శన్ సీఎంఐ పబ్లిక్ స్కూల్ ఉంది. ఈ బడి రూటే సెపరేటు. అన్ని పాఠశాలల్లో ఎప్పుడెప్పుడు తరగతులు అయిపోతాయా? ఎప్పుడెప్పుడు గ్రౌండ్లో వాలిపోదామా అన్నట్లు పిల్లలుంటారు. కానీ ఇక్కడ పిల్లలు మాత్రం ‘ఏ పంట పండిద్దాం? సేంద్రియ ఎరువులు ఎలా వాడదాం, వెదురు వనంలో ఇంకా కొత్తరకం మొక్కలు ఏమైనా వచ్చాయా?’ అని తెలుసుకునే ప్రయత్నాల్లో ఉంటారు.
పచ్చని ఒడి..
నిజానికి ఈ బడిలో అడుగుపెట్టగానే పచ్చని ప్రకృతి ఒడిలోకి వెళ్లినట్లుగా ఉంటుంది. ముఖ్యంగా వెదురు వనం ఇట్టే ఆకర్షిస్తుంది. ఇందులో దాదాపు 34 రకాల వెదురు మొక్కలున్నాయి. దేశం నలుమూలల నుంచీ వీటిని తెప్పించి నాటారు. ఈ వెదురు మొక్కలకు ఓ ప్రత్యేకత ఉంది. ఇవి ఇతర మొక్కలకంటే ఎక్కువ పరిమాణంలో గాలి నుంచి కార్బన్ డై ఆక్సైడ్‌ను స్వీకరిస్తాయి, ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి.
అంతా.. సేంద్రియమే..
ఇక్కడి విద్యార్థుల చేతుల్లో పుస్తకాలు, పెన్నులతో పాటు కూరగాయలు, ఆకుకూరలూ ఉంటాయి. ఎందుకంటే ఈ బడి ప్రాంగణంలో సేంద్రియ పద్ధతుల్లో వీటిని పండిస్తారు. వీటి బాగోగులన్నీ విద్యార్థులే చూసుకుంటారు. ఉపాధ్యాయులు పర్యవేక్షిస్తారు. నిజంగా ఈ బడి మిగతా పాఠశాలలతో పోల్చుకుంటే ప్రత్యేకమే కదా. మీరూ.. మీ ఉపాధ్యాయుల సహకారంతో పచ్చదనాన్ని పెంచే ప్రయత్నం చేయండి. మీ బడి కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది ఏమంటారు ఫ్రెండ్స్!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
చనిపోయాడనుకొని ఖననం చేశారు.. కానీ స్నేహితుడికి వీడియో కాల్!
-
Ap-top-news News
Andhra News: పన్నులు వసూలు చేసే వరకూ సెలవుల్లేవ్
-
India News
JEE Main: జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
World News
Earthquake: ఈ దేశాల్లో నిత్యం భూప్రళయాలే
-
India News
Punjab: చేతులతో నాలుగు బుల్లెట్ బైక్‌లను ఆపిన యువకుడు
-
India News
Marriage: వరుడికి 65.. వధువుకు 23