Updated : 16 Feb 2022 06:50 IST

క్విజ్‌.. క్విజ్‌...!

1. భారతదేశంలో సూర్యుడు మొదటిగా ఏ రాష్ట్రంలో ఉదయిస్తాడు?
2. ఏ దేశ క్రికెట్‌ జట్టును ‘ఆసిస్‌’ అని పిలుస్తుంటారు?
3. ‘తాజ్‌ మహల్‌’ను ఏ రాయితో నిర్మించారు?

4. యానిమేషన్‌ చిత్రాల్లో కనిపిస్తూ, సీసాలోంచి వచ్చే ఈ పాత్ర పేరేమిటి?
5. అమెరికాలో పెంపుడు జంతువుగా ఏ జీవిని ఎక్కువగా పెంచుకుంటుంటారు?  
6. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం  ఏ సముద్రానికి సమీపంలో ఉంది?


ఆ ఒక్కరెవరు?

ఇక్కడున్న వారిలో ఒక్కరు మాత్రం భిన్నం. అదెవరో కనిపెట్టగలరా!


అక్షర వలయం

ఈ ఆధారాల సాయంతో వృత్తంలోని ఖాళీలను నింపండి. అన్నీ ‘వ’తో మొదలయ్యే పదాలే వస్తాయి.

1. నది పొంగితే వచ్చేది 2. వృత్తం
3. ఒక రుతువు 4. రీసోర్స్‌.. తెలుగులో  
5. అడవిని దాచుకున్న పేరు
6. న్యాయవాది  7. చలికి పుట్టేది
8. ఆరుబయట ఉండేది  


జత చేయండి

కింద ఒక వరసలో జీవుల పేర్లు, మరో వరసలో వాటి కాళ్ల సంఖ్య ఉంది. సరైన జోడీని గుర్తించండి చూద్దాం..


అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి. వాటిలో ఏది అవునో, ఏది కాదో చెప్పగలరా?


అక్షరాల  చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే వచ్చే పదమేంటో  ఒకసారి ప్రయత్నించండి.


కవలలేవి?
ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


చెప్పుకోండి చూద్దాం  

ఒక అబ్బాయి, ఒక డాక్టర్‌ కలిసి చేపలు పడుతున్నారు. ఆ అబ్బాయి డాక్టర్‌ కొడుకే కానీ ఆ డాక్టర్‌ మాత్రం అతడి తండ్రి కాదు. మరి ఇంతకీ డాక్టర్‌ ఎవరు?


నేనెవర్ని?

1. నేను మీ శరీరంలోని భాగాన్ని. కానీ, పెరిగేకొద్దీ మీరు వద్దనుకుంటారు. ఎదురు డబ్బులిచ్చి మరీ వదిలించుకుంటారు.

2. మేము ప్రతి రోజూ వస్తాం. మాతోనే మీకు రోజు గడిచినా.. ఎప్పటికీ మేం కలుసుకోం. ఒకరి తర్వాత ఒకరుగానే ఉంటాం. ఇంతకీ మేం ఎవరం?  


నేను గీసిన బొమ్మ


జవాబులు

క్విజ్‌.. క్విజ్‌...!: 1.అరుణాచల్‌ప్రదేశ్‌ 2.ఆస్ట్రేలియా 3. పాలరాయి  4.జీనీ  5.పిల్లి 6.బంగాళాఖాతం
ఆ ఒక్కరెవరు : కామన్‌మ్యాన్‌
అక్షర వలయం : 1.వరద 2.వలయం 3.వసంతం 4.వనరు  5.వనజ 6.వకీలు 7.వణుకు 8.వరండా
జత చేయండి : 1-ఎఫ్‌, 2-ఇ, 3-డి, 4-సి, 5-బి, 6-ఎ
అవునా.. కాదా : 1.అవును 2.కాదు 3.కాదు 4.కాదు 5.అవును
అక్షరాల చెట్టు: COMMUNICATION
కవలలేవి : 1, 3
చెప్పుకోండి చూద్దాం : అబ్బాయి వాళ్ల అమ్మ
నేనెవర్ని : 1.జుట్టు 2.పగలు, రాత్రి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని